Viral Video Man Takes Bull For Ride on Bike : స్మార్ట్ ఫోన్ వినియోగం పెరిగినప్పటినుంచి సోషల్ మీడియా వినియోగం కూడా రెట్టింపు అయ్యింది. ప్రపంచంలో ఎక్కడ ఎలాంటి సంఘటనలు జరిగినా సులభంగా సోషల్ మీడియా ద్వారా తెలుసుకోగలుగుతున్నారు. అంతేకాకుండా అప్పుడప్పుడు కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో నిమిషాల్లో తెగ వైరల్‌గా మారుతున్నాయి. ఈ వీడియోల్లో ఎక్కువగా జంతువులకు సంబంధించినవి ఉంటున్నాయి.
చాలా మంది పెంపుడు జంతువులను పెంచుకుంటారు. వాటి ఆలనా పాలన విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అంతే కాకుండా వాటితో కలిసి భోజనం చేయటం, ఒకే బెడ్‌పై నిద్రపోవడం, వాటిని హగ్ చేసుకోవడం, వాటిని బైక్ రైడింగ్‌కి తీసుకెళ్లడం వంటి దృశ్యాలు కూడా చూశాం. తాజాగా అలాంటిదే ఓ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
సాధారణంగా పిల్లులు, కుక్కలను.. బైక్, కార్లలో తీసుకెళ్లడం మనం చూసి ఉంటాం. కానీ, ఎక్కడ జరిగిందో ఏమో తెలియదు కానీ, ఓ వ్యక్తి ఏకంగా ఎద్దును తన బైక్ పై తీసుకెళ్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోపై మనమూ ఓ లుక్కేద్దాం..
Viral Video :ఈ వీడియోలో ఓ వ్యక్తి తన బైక్ పై ఎద్దును ముందు కూర్చోబెట్టుకుని వేగంగా నడుపుతున్నాడు. అంత వేగంతో వెళ్తున్నా ఆ ఎద్దు.. ఎటూ కదలకుండా ముందు కూర్చుని అటూ ఇటూ చూస్తోంది. మామూలుగా ఎద్దు.. ఏదైనా పెద్ద వాహనంలో ఎక్కిస్తేనే.. అటు ఇటు కదలకుండా ఉంటుంది. కానీ, ఇక్కడ మాత్రం పూర్తి భిన్నంగా, ఎటువంటి భయం లేకుండా దర్జాగా కూర్చుంది.