తెలంగాణ

telangana

By ETV Bharat Telugu Team

Published : Nov 9, 2023, 3:14 PM IST

ETV Bharat / bharat

దీపావళి వేళ దేశమంతా వెలుగులు- ఆ గ్రామాల్లో మాత్రం చీకట్లు, కారణం ఏంటంటే?

Villiages Not Celebrating Diwali From 50 Years : దాదాపు ఐదు దశాబ్దాల నుంచి దీపావళి పండగకు దూరంగా ఉంటున్నాయి పంజాబ్ బఠిండా జిల్లాలోని మూడు గ్రామాలు. ఆర్మీ కంటోన్మెంట్​, మందుగుండు సామగ్రి డిపో ఈ ప్రాంతంలో ఉండటం వల్ల.. దీపావళి శోభ లేక మూగబోతున్నాయి. పండగరోజు ఆనందంగా గడపడానికి తమ పిల్లలను బంధువులు ఇంటికి పంపాల్సి వస్తోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Villiages Not Celebrating Diwali From 50 Years
Villiages Not Celebrating Diwali From 50 Years

Villiages Not Celebrating Diwali From 50 Years :దీపావళి వేడుకలను ఘనంగా జరపుకోవడానికి యావత్​ దేశం ఉత్సాహంగా సిద్ధమవుతోంది. కానీ పంజాబ్ బఠిండా జిల్లాలోని మూడు గ్రామాలు మాత్రం పండగకు దూరంగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఆర్మీ కంటోన్మెంట్​, మందుగుండు సామాగ్రి డిపో ఉండటం వల్ల.. దాదాపు 50 ఏళ్లుగా ఈ గ్రామాలు దీపావళి శోభ లేక మూగబోతున్నాయి.

ఫూస్​ మండి, భగు, గులాబ్​గఢ్ గ్రామాల్లోని కంటోన్మెంట్

జిల్లాలోని ఫూస్​ మండి, భగు, గులాబ్​గఢ్ గ్రామాల్లో బాణసంచా పేల్చడం, పంట వ్యర్థాలను కాల్చడంపై నిషేధం విధించారు. దీని వల్ల దాదాపు 5 దశాబ్దాలుగా తాము దీపావళి పండగ జరుపుకోలేదని గ్రామస్థులు చెబుతున్నారు. భారీగా భూమి సేకరించి 1976లో కంటోన్మెంట్ నిర్మించారని తెలిపారు.

కంటోన్మెంట్​ పరిధిలోని గ్రామస్థులు

"మేము ఆర్మీ కంటోన్మెంట్, మందుగుండు సామగ్రి డిపో​కు దగ్గర్లో నివసిస్తున్నాము. మా గ్రామంలోని భూమి ధరలు పెరగలేదు. మా గ్రామంలోకి రావడానికి డైరెక్ట్​ రోడ్డు లేదు. అధికార యంత్రాంగం విధించిన కఠిన ఆంక్షల కారణంగా దీపావళి పండగ రోజు మా ఇళ్లకు రావడానికి మా బంధువులు ఇష్టపడటం లేదు. మా గ్రామంలో టాపాసులు కాల్చడంపై ప్రతి దీపావళికి ఆంక్షలు విధిస్తారు."
--గ్రామస్థుడు

పండగరోజు తమ పిల్లలు టపాసులు కాల్చి ఆనందంగా గడపడానికి తమ బంధువులు ఇంటికి పంపించాల్సి వస్తోంది. నిబంధనలను విరుద్ధంగా ఎవరైన టపాసులను, పంట వ్యర్థాలను కాల్చినా.. జిల్లా యంత్రాంగం కఠిన చర్యలు తీసుకుంటుందని చెబుతున్నారు.

ఫూస్​ మండి, భగు, గులాబ్​గఢ్ గ్రామాల్లోని కంటోన్మెంట్

"కంటోన్మెంట్​ 1976లో నిర్మించారు. ఆ తర్వాత మందుగుండు సామగ్రి డిపో నిర్మించారు. అప్పటి నుంచి మేము దీపావళి జరుపుకోలేదు. మాకు 5-7 గ్రామాలకు సరైన రోడ్డు లేదు. దీంతో రోజువారి రవాణాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి."
--గ్రామస్థుడు

బాణసంచా, పంట వ్యర్థాలను కాల్చడంపై నిషేధంతో పాటు, కంటోన్మెంట్​లో.. గడువు ముగిసిన మందుగుండు పేల్చడం వల్ల తమ గ్రామంలో వాటి శకలాలు పడిన ఘటనలు కూడా ఉన్నాయని ఫూస్​ మండి గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాంటి ఘటనల్లో తమ ఆస్తులకు నష్టం కలిగిందని.. కానీ వాటిపై ఫిర్యాదు చేస్తే అధికారులు చర్యలు తీసుకోలేదని వాపోయారు. దీనికి తోడు కంటోన్మెంట్​ ప్రాంతంలో కొత్త నిర్మాణాలు చేపట్టకుండా నిషేధం ఉందని స్థానికులు తెలిపారు. ఆర్మీ కంటోన్మెంట్ ఉండటం, సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడం వల్ల తమ భూముల ధరలు కూడా పెరగలేదని చెబుతున్నారు. ఈ కారణాల వల్ల పండగ సందర్భాల్లో బంధువులు కూడా తమ ఇళ్లకు రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల దీపావళి జరుపుకోలేకపోతున్నామని చెప్పారు.

పంట వ్యర్థాలు

బ్యాంకు మేనేజర్‌ ఉద్యోగం వదిలి.. సేవా మార్గంలోకి..

"గుండె రాయి చేసుకున్నా.. ఆ 400 కుటుంబాల కోసం.."

ABOUT THE AUTHOR

...view details