దేశంలో దసరా ఉత్సవాలు(dasara festival 2021) ఘనంగా జరుగుతున్నాయి. వేకువజాము నుంచే భక్తుల రాకతో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి.
రక్షణ మంత్రి 'శస్త్ర పూజ'..
విజయదశమిని(dasara festival 2021) పురస్కరించుకుని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ ఆయుధ పూజ నిర్వహించారు. దిల్లీలోని డీఆర్డీఓ కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
రాజ్నాథ్ సింగ్ ఆయుధ పూజలు బంగాల్ దుర్గాపూజ..
విజయదశమి(dasara festival 2021) చివరి రోజును పురస్కరించుకుని బంగాల్లో 'సింధూర్ ఖేలా' నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్దఎత్తున పాల్గొన్నారు.
బంగాల్ సింధూర్ ఖేలాలో మహిళల కోలాహలం..
తమిళనాడు ఆచారం..
చెన్నైలోని అయ్యప్ప దేవాలయంలో విజయదశమి సందర్భంగా.. సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహించారు. 'దసరా రోజున పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పే ఆచారం ఏళ్లుగా వస్తోందని' ఆలయ పూజారి తెలిపారు.
బాటిల్లో దుర్గామాత..
ఒడిశా ఖుర్దాకు చెందిన మినియేచర్ ఆర్టిస్ట్(సూక్ష్మ కళాకారుడు) ఈశ్వర్ రావు సీసా లోపల దుర్గామాత ప్రతిమను రూపొందించారు. మట్టి, కాగితంతో సీసాలోనే మూడంగుళాల విగ్రహాన్ని రూపొందించాడు. దీని తయారీకి ఏడురోజులు పట్టిందని తెలిపాడు.
దుర్గామాత విగ్రహంతో మినియేచర్ ఆర్టిస్ట్ ఈశ్వర్ రావు
దుర్గామాతను రూపొందిస్తున్న మినియేచర్ కళాకారుడు
మహారాష్ట్ర అమ్మవారు..
విజయదశమి పర్వదినం సందర్భంగా పుణెలోని శ్రీ మహాలక్ష్మి దేవాలయంలో అమ్మవారు బంగారు చీరతో ముస్తాబైంది. 16 కేజీల బరువున్న ఈ చీరను ఓ భక్తుడు అందించారు. '11 ఏళ్లుగా ఈ సంప్రదాయాన్ని అనుసరిస్తున్నాం' అని ఆలయ కార్యదర్శి దీపక్ వనరసే చెప్పారు.
మహారాష్ట్రలో వెలిగిపోతున్న అమ్మవారు
ఘనంగా పూజలు.. ఆదర్శంగా నిమజ్జనం..
దిల్లీలో ఐదు రోజులు పూజలందుకున్న దుర్గామాతను నిమజ్జనం చేసేందుకు తాత్కాలిక ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు.
ఇవీ చదవండి: