తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వెంకయ్య నాయుడు ఇంట.. వైభవంగా ఉగాది వేడుకలు.. - వెంకయ్య నాయుడి ఇంట్లో ఉగాది వేడుకకు హాజరైన మోదీ

Venkaiah Naidu Celebrated Ugadi: దిల్లీలోని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నివాసంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ వేడుకకు ప్రధాని మోదీ సహా.. పలువురు కేంద్రమంత్రులు, వివిధ పార్టీ నేతలు హాజరయ్యారు. ఈ వేడుకలో నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఉగాది వేడుకను ప్రతిబింబించేలా అలరించాయి.

Venkaiah Naidu Celebrated Ugadi Festival 2023
వెంకయ్య నాయుడు ఇంట్లో ఉగాది వేడుకలు

By

Published : Mar 21, 2023, 12:06 PM IST

Updated : Mar 21, 2023, 2:28 PM IST

వెంకయ్య నాయుడు ఇంట్లో ఉగాది వేడుకలు

Venkaiah Naidu Celebrated Ugadi: తెలుగు వారి తొలి పండుగ ఉగాది. ఈ పండుగను తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో వైభవంగా జరుపుకొంటారు. ఈ తెలుగు సంవత్సరంలో తొలి మాసమైన చైత్రం.. ఎన్నో పర్వదినాలకు నెలవు. వసంత నవరాత్రులూ... సీతారాముల కల్యాణం... హనుమాన్‌ ఆరాధనతోపాటు మరెన్నో విశిష్టతల సమాహారం చైత్రం అంటున్నాయి పురాణాలు. మామిడాకుల తోరణాలు కట్టిన వాకిళ్లతో, ముంగిట ముత్యాల ముగ్గులతో తెలుగు సంవత్సరాదిని స్వాగతించే ఈ చైత్రంలో చేసే దేవతారాధన సకల శుభాలూ కలిగిస్తుందని అంటారు. ఆధ్యాత్మిక, పౌరాణిక విశిష్టతలూ కలిగిన ఈ మాసంలో పౌర్ణమి వరకూ ప్రతిరోజూ ఓ పర్వదినమేనని అనుకోవచ్చు.

తెలుగువారు ఎంతో ఇష్టంగా జరుపుకునే ఉగాది పండుగ రానే వచ్చేసింది. ఈ నెల 22వ తేదీ బుధవారం తెలుగు ప్రజలంతా జరుపుకోబోయే శోభకృత్ నామ ఉగాది ఉత్సవాలను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తన నివాసంలో ఘనంగా నిర్వహించారు. 'ఉగాది మిలన్' పేరుతో దిల్లీలోని తన అధికారిక నివాసంలో సోమవారం సాయంత్రం ఆయన ఈ వేడుకలను నిర్వహించారు. ఆయన.. తెలుగువారితో పాటు కన్నడ, తమిళ, మలయాళీల కోసం ప్రత్యేకంగా ఈ ఉగాది ఉత్సవాలను జరిపించారు. ఈ వేడుకలకు ప్రధాని మోదీతో సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్​వీ రమణ, ఏపీ గవర్నర్‌ జస్టిస్‌ నజీర్‌, హరియాణా గవర్నర్‌ దత్తాత్రేయలతో పాటు కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, పీయూష్‌ గోయల్‌ హాజరయ్యారు. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు చెందిన విభిన్న పార్టీల ఎంపీలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి విచ్చేశారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన వివిధ రాజకీయ పార్టీల ప్రజా ప్రతినిధులు ఈ వేడుకల్లో ఆప్యాయంగా పలకరించుకున్నారు.

ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. వేడుకలకు విచ్చేసిన అతిథులంతా సంప్రదాయ నృత్యాలను తిలకించి.. ఉగాది పచ్చడిని స్వీకరించారు. అనంతరం దేశ ప్రజలందరికీ ప్రధాని ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది వేడుకను నిర్వహించిన వెంకయ్యను ఆయన అభినందించారు.

" ప్రజలు అందరూ కలిసే ఇలాంటి అవకాశాల కోసం వెంకయ్యనాయుడు వెతుకుతూ ఉంటారు. చాలా రోజుల నుంచి ఆయనకు ఆ అవకాశం రాలేదు. అయితే ఆ అవకాశం ఇప్పుడొచ్చింది. వెంకయ్య ప్రతి విషయంలోనూ ఆనందం పొందుతారు. అందరితో కలిసి భోజనం చేయడం, చేయించడం ఆయనకు ఎంతో ఇష్టమైన పని. ఉగాది వేడుకల కారణంగా నాకు ఈ రోజు వారి కుటుంబ సభ్యులందరినీ కలిసే అవకాశం వచ్చింది. దేశంలోని ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు." - ప్రధాని నరేంద్ర మోదీ

ఇవీ చదవండి:

Last Updated : Mar 21, 2023, 2:28 PM IST

ABOUT THE AUTHOR

...view details