మే1 నుంచి 18ఏళ్లు పైబడిన వారందరకీ కరోనా టీకా పంపిణీ ప్రక్రియ పంజాబ్‌లో ఆలస్యం అవునుందని ఆందోళన వ్యక్తం చేశారు ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి బల్బీర్ సింగ్ సిద్ధూ. రాష్ట్రంలో సరిపడా కరోనా టీకాలు లేకపోవడమే ఇందుకు కారణమని తెలిపారు.
"18-45 ఏళ్ల వయసు వారికి టీకాలు వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు 30 లక్షల కోవిషీల్డ్ డోసుల కోసం ఆర్డర్ ఇచ్చింది. బుధవారం, మాకు రెండు లక్షల మోతాదులు వచ్చాయి. ఆ రోజుకు ముందు 1.50 లక్షల టీకా డోసులు వచ్చాయి. కానీ గురువారం, శుక్రవారం ఎన్ని వస్తాయో మాకు తెలియదు. కనీసం 10 లక్షల మోతాదులు వస్తే, ఈ కార్యక్రమం సాగుతుంది. "
-బల్బీర్ సింగ్ సిద్ధూ, పంజాబ్ ఆరోగ్యమంత్రి
45 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ పంపిణీలోనూ టీకాల కొరత ఉందని కేంద్రానికి ఫిర్యాదు చేసింది పంజాబ్. రాష్ట్రానికి వారానికి 15 లక్షల మోతాదులను ఇవ్వాలని కేంద్రాన్ని అప్పట్లో కోరింది. టీకాల కొరత కారణంగా, రాష్ట్ర ప్రభుత్వం అనేక కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ను నిలిపివేసింది. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత కూడా ఉన్నట్లు ఆరోగ్య మంత్రి గురువారం చెప్పారు. రోజుకు 300 మెట్రిక్ టన్నులు అవసరం ఉండగా కేంద్రం 105 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను మాత్రమే పంపించిందని అన్నారు. అయితే ఇతర చోట్ల నుంచి మరో 36 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను తెచ్చుకున్నామని తెలిపారు.
ఇదీ చదవండి:ఎగ్జిట్ పోల్స్: బంగాల్, అసోంలో భాజపాకు పట్టం!