దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో ఏడు ఖాళీలు ఏర్పడ్డాయి. మరో రెండు హైకోర్టులు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తులతోనే పనిచేస్తున్నాయి. మరో రెండు హైకోర్టుల్లోని ప్రధాన న్యాయమూర్తులు వచ్చే రెండు మూడు నెలల్లో పదవీ విరమణ పొందనున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఖాళీల భర్తీకి సుప్రీం కొలీజియం సిఫార్సుల కోసం ప్రభుత్వం వేచి చూస్తున్నట్లు పేర్కొన్నాయి.
2019లో అప్పటి ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయి పదవీ విరమణ పొందగా.. సుప్రీంకోర్టులో మొదటి ఖాళీ ఏర్పడింది. ఆ తర్వాత గత నెల ఐదుగురు న్యాయమూర్తులు పదవీ విరమణ పొందారు. మరో న్యాయమూర్తి జస్టిస్ మోహన్ ఎం శాంతానుగౌడర్ మృతిచెందారు. దీంతో సుప్రీంకోర్టులో ఏడు ఖాళీలు ఏర్పడ్డాయి.