ఓ చిన్నారి పట్ల అమానుషంగా (child bullying) ప్రవర్తించాడో వ్యక్తి. నాలుగేళ్ల బాలుడిని అపహరించి.. నోట్లో తుపాకీ పెట్టి బెదిరించాడు. ఉత్తర్ప్రదేశ్ మొరాదాబాద్ జిల్లా దిలారి ప్రాంతంలోని ఇలార్ అనే గ్రామంలో ఈ ఘటన జరిగింది.
'చిన్నారికి తల్లి లేదని.. ఈ వీడియో తనకు వాట్సాప్‌లో వచ్చిందని' బంధువు విజేంద్ర తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ నిందితునిపై సరైన చర్యలు తీసుకోవట్లేదని ఆరోపించారు. కఠినంగా శిక్షించాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
"గ్రామంలో పలుకుబడి ఉన్న వ్యక్తి బాలుడిని కిడ్నాప్ చేశాడు. నాలుగేళ్ల చిన్నారిని నోరు తెరవాలని బెదిరించాడు. నోట్లో తుపాకీ పెట్టి, మంచం మీద పడేసి.. కొడుతున్న వీడియో వాట్సాప్‌లో వచ్చింది. తల్లి లేని చిన్నారిని హింసించారు. పోలీసులు ఇది చాలా చిన్న కేసు అంటున్నారు. అందుకే ఎస్పీని కలిసేందుకు వచ్చా. బాలుడిని విడిపించకపోతే డీఐజీ కార్యాలయానికి కూడా వెళ్తా.
--విజేంద్ర, చిన్నారి బంధువు