ఉత్తరాఖండ్‌లో కరోనా మహమ్మారి పిల్లల్లో వేగంగా వ్యాపిస్తోంది. గడిచిన పదిరోజుల్లోనే 1000 మంది తొమ్మిదేళ్లలోపు పిల్లలు కరోనా బారిన పడ్డారు. గత సంవత్సరం మొత్తం 2,131మంది పిల్లలకు కరోనా సోకగా ఈ ఏడాది ఆ సంఖ్య భారీగా ఉందని ప్రభుత్వం తెలిపింది. కరోనా రెండో దశ ప్రారంభమైన తర్వాత.. ఏప్రిల్ 1 నుంచి 15వ తేదీ వరకు 264 మంది పిల్లలకు కరోనా సోకింది. ఏప్రిల్ 16 నుంచి 30వరకు 1,053మంది చిన్నారులకు వైరస్ పాజిటివ్‌గా తేలింది. మే 1 నుంచి 14 వరకు 1,618 మంది పిల్లలు కొవిడ్ బారిన పడ్డారు.
రాష్ట్రంలో ప్రతి లక్షమందిలో 771 కరోనా కేసులు నమోదవుతున్నాయని సోషల్ డెవలప్మెంట్ ఫర్ కమ్యూనిటీస్ ఫౌండేషన్(ఎస్డీసీఎఫ్) అధ్యక్షుడు అనూప్ నైనిటాల్ తెలిపారు. అది ఉత్తర్‌ప్రదేశ్‌తో పోల్చుకుంటే ఏడు రెట్లు అధికమని అన్నారు. కరోనా పరీక్షల్ని చేయడంలో, మరణాల సంఖ్య తగ్గించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.