తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కరోనా మాత' ఆలయం కూల్చివేత - కరోనా దేవాలయం

ఉత్తర్​ప్రదేశ్​ ప్రతాప్​గఢ్​లో కొత్తగా నిర్మించిన 'కరోనా మాత' ఆలయాన్ని అధికారులు కూల్చేశారు. ప్రజలు మూఢనమ్మకాల్లో చిక్కుకోకూడదని ఇలా చేసినట్లు అధికార యంత్రాంగం తెలిపింది.

Corona Mata temple
కరోనా మాత దేవాలయం

By

Published : Jun 13, 2021, 4:06 PM IST

Updated : Jun 13, 2021, 6:25 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ ప్రతాప్​గఢ్​ జిల్లాలోని సంఘీపుర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఉన్న జూహీ శుక్లాపుర్​లో నిర్మించిన 'కరోనా మాత' ఆలయాన్ని అధికారులు కూల్చేశారు. ఆలయ నిర్మాణంపై దర్యాప్తునకు ఆదేశించారు.

ప్రజలు మూఢనమ్మకాల్లో చిక్కుకోకూడదని ఇలా చేసినట్లు ఐజీ కేపీ సింగ్​ తెలిపారు.

కరోనా మాత దేవాలయం కూల్చివేసిన అధికారులు
కరోనా మాత దేవాలయం కూల్చేసిన ప్రాంతం

కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి పోలీసు బృందాలు కృషి చేస్తున్నాయని అన్నారు కేపీ సింగ్. ఇది ఓ ప్రమాదకరమైన వైరస్​ అని చెప్పిన ఆయన.. ప్రజలు ఇలాంటి ముఢనమ్మకాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.

కూల్చివేతకు ముందు పూజలు చేస్తున్న మహిళ
కూల్చివేతకు ముందు గ్రామస్థుల పూజలు

సోదరుని ఫిర్యాదుతో...

కరోనా మాత ఆలయాన్ని నిర్మించిన లోకేశ్​ కుమార్​పై అతని సోదరుడు నగేశ్​కుమార్​ శ్రీవాత్సవ ఫిర్యాదు చేసినట్లు ఐజీ కేపీ సింగ్​ తెలిపారు. లోకేశ్​ ఆలయ నిర్మాణం చేసేటప్పుడు ఇతర కుటుంబ సభ్యులు ఎవరినీ సంప్రదించలేదని ఫిర్యాదులో పేర్కొన్నట్లు వివరించారు. నిర్మాణం పూర్తి అయిన తరువాత తాను నివసిస్తున్న ఘజియాబాద్​కు తిరిగి వెళ్లినట్లు ఐజీ చెప్పారు.

విముక్తి కలిగిస్తుందని..

ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రాణాలు బలిగొన్న కరోనా వైరస్​ను నివారించడానికి దేవతగా భావించి పూజిస్తున్నట్లు స్థానికులు తెలిపారు.

"ఈ వైరస్​ను నయం చేసే శక్తి కరోనా మాతకు ఉందని మేము నమ్ముతున్నాము. గతంలో ఇలానే మశూచి వచ్చినప్పుడు మశూచి తల్లి నయం చేసిందని విన్నాము. అలానే కరోనా మాత ఈ కష్టాల నుంచి బయట పడేస్తుందని ఆలయాన్ని ఏర్పాటు చేశాము. ఇందుకు గ్రామస్థుల నుంచి విరాళాలు సేకరించాం. దేశంలో ఇలాంటి ఆలయాలు ఏర్పాటు చేయడం ఇదేం మొదటి సారి కాదు. గతంలో అంటువ్యాధులు ప్రబలినప్పుడు ఇలానే పూజించారు. అయితే విగ్రహాన్ని తాకేందుకు భక్తులకు అనుమతి లేదు."

- రాధే శ్యామ్​, ఆలయ పూజారి

ఇదీ చూడండి:'కరోనా మాతా.. నువ్వే రక్షించాలమ్మా'

Last Updated : Jun 13, 2021, 6:25 PM IST

ABOUT THE AUTHOR

...view details