తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సైనిక బలగాల్లో యూపీ టాప్​.. తెలుగు రాష్ట్రాల నుంచి ఎందరో తెలుసా? - ఆర్మీ ఉత్తర్​ప్రదేశ్​ వాసులు

సైన్యంలోకి బలగాలను అందిస్తున్న రాష్ట్రాల్లో ఉత్తర్​ప్రదేశ్​ అగ్రస్థానంలో నిలిచింది. యూపీ తర్వాత స్థానాల్లో పంజాబ్​, మహారాష్ట్ర, రాజస్థాన్​, బిహార్, హరియాణాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రానికి చెందిన వారు 42,926.. తెలంగాణ వాసులు 10,798 మంది ఉన్నారు.

army
ఆర్మీ

By

Published : Jun 19, 2022, 8:51 AM IST

దేశ సైనిక బలగాల్లో ఉత్తర్‌ప్రదేశ్‌ వాసులు ఎక్కువగా ఉన్నారు. 2021 డిసెంబరు నాటికి త్రివిధ దళాల్లో 14,11,658 మంది పనిచేస్తున్నారు. ఇందులో ఆర్మీలో జూనియర్‌ కమిషన్డ్‌ అధికారులు, ఇతర ర్యాంకు సిబ్బంది కలిపి 11,10,079 మంది ఉన్నారు. వారిలో 14.65% మంది ఉత్తర్‌ప్రదేశ్‌ వాసులే. ఈ సంఖ్యాపరంగా ఆంధ్రప్రదేశ్‌ 13, తెలంగాణ 19 స్థానాల్లో నిలుస్తున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌ తర్వాతి స్థానాల్లో పంజాబ్‌, మహారాష్ట్ర, రాజస్థాన్‌, బిహార్‌, హరియాణా, ఉత్తరాఖండ్‌, పశ్చిమబెంగాల్‌, తమిళనాడు, హిమాచల్‌ప్రదేశ్‌ ఉన్నాయి. హరియాణా, హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లు జనాభా పరంగా చిన్న రాష్ట్రాలైనప్పటికీ సైన్యంలో పెద్దసంఖ్యలో అక్కడివారు నియమితులయ్యారు.

రెండేళ్లుగా తగ్గిన నియామకాలు
కరోనా కారణంగా గత రెండేళ్లలో సైన్యంలో నియామకాలు తగ్గాయి. నేవీలో గత ఐదేళ్లలో 25,996 మంది సెయిలర్లను నియమించారు. ఆర్మీలో నియామకాల కోసం 2017-18లో 106, 2018-19లో 92, 2019-20లో 95 రిక్రూట్‌మెంట్‌ ర్యాలీలు నిర్వహించారు. 2020-21లో ఇవి 47కి, 2021-22లో 4కి తగ్గిపోయాయి. 2018 నుంచి నౌకాదళంలో ఏడాదికి రెండుసార్లు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించి వాటి ఆధారంగా నియామకాలు చేపడుతున్నారు. వాయుసేనలో ఎయిర్‌మెన్‌ నియామకాలను కూడా నిర్దిష్ట పరీక్షల ద్వారా చేపడుతున్నారు.

ఇదీ చూడండి :భోజనం పెట్టలేదని భార్యను చంపిన భర్త.. రాత్రంతా శవంతోనే..

ABOUT THE AUTHOR

...view details