ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం జరిగింది. శిథిలావస్థకు చేరిన మూడంతస్తుల భవనం కూలి.. ఐదుగురు మరణించారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. జౌన్‌పుర్ జిల్లాలోని రౌజా అర్జన్ ప్రాంతంలో భవనం కూలిపోయిందని అధికారులు తెలిపారు. గురువారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.
ఒక్కసారిగా భవనం కుప్పకూలడం వల్ల 12 మందికిపైగా శిథిలాల కింద చిక్కుకున్నారని అధికారులు వెల్లడించారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆరుగురిని బయటకు తీశారు. గాయపడిన వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.