తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Uttar Pradesh Crime News : మహిళపై గ్యాంగ్​రేప్.. బలవంతంగా విషం తినిపించి హత్య.. చనిపోయే ముందు.. - ఉత్తర్​ప్రదేశ్ అత్యాచారం న్యూస్

Uttar Pradesh Crime News Today : మహిళపై అత్యాచారం చేసి బాధితురాలితో పాటు ఆమె కుటుంబ సభ్యులకు బలవంతంగా విషం తినిపించారు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని బస్తీ జిల్లాలో జరిగింది. ఈ ఘటనలో బాధితురాలు, ఆమె భర్త చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు, ఝార్ఖండ్​లో ఓ యువతిపై కొందరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

Uttar Pradesh Crime News today
Uttar Pradesh Crime News today

By ETV Bharat Telugu Team

Published : Sep 22, 2023, 10:45 PM IST

Uttar Pradesh Crime News Today :ఉత్తర్​ప్రదేశ్ బస్తీ జిల్లాలో అమానుష ఘటన జరిగింది. ఓ మహిళపై అత్యాచారం చేసిన దుండగులు.. బాధితురాలితో పాటు ఆమె భర్త, పిల్లలకు బలవంతంగా విషం తినిపించారు. రుధౌలి ప్రాంతంలో గురువారం రాత్రి ఈ ఘటన జరగ్గా.. మహిళ భర్త చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మరణించాడు. బాధితురాలు శుక్రవారం మధ్యాహ్నం ప్రాణాలు కోల్పోయింది. ముగ్గురు చిన్నారుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. చనిపోయే ముందు బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

స్థానికులకు శుక్రవారం ఉదయం ఈ ఘటన గురించి తెలిసింది. వెంటనే వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. తర్వాత అందరినీ దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రాథమిక చికిత్స అనంతరం బాధితురాలిని, ఆమె భర్తను వైద్యులు జిల్లా ఆస్పత్రికి సిఫార్సు చేశారు. వారినికి అక్కడికి తరలించగా.. మహిళ భర్త చికిత్స పొందుతూ చనిపోయాడు. బాధితురాలిని బీఆర్​డీ మెడికల్ కళాశాలకు తీసుకెళ్లగా.. మధ్యాహ్నం ఆమె కన్నుమూసింది. అయితే, పోస్టుమార్టం పరీక్షల తర్వాతే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు చెప్పారు. అత్యాచారం జరిగిందన్న విషయాన్ని పరీక్షల తర్వాతే నిర్ధరించగలమని పేర్కొన్నారు.

ఉదయమే ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు.. బాధితురాలి వాంగ్మూలాన్ని సేకరించారు. ఆత్రిలోకి, ఆదర్శ్ సింగ్ అనే ఇద్దరు వ్యక్తులు తనను రేప్ చేసి.. కుటుంబం అంతటికీ విషం పెట్టారని బాధితురాలు పేర్కొంది. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితులు తమ తల్లిని ఇబ్బంది పెట్టేవారని బాధితురాలి చిన్నారులు పోలీసులతో పేర్కొన్నారు. తమ ఇంటికి కొద్దిదూరంలోనే వారు నివసించేవారని తెలిపారు. తన తండ్రి వారిని చాలాసార్లు వ్యతిరేకించారని చెప్పారు. మరోవైపు, బాధితురాలి భర్తకు ల్యాండ్ మాఫియాతో భూతగాదాలు ఉన్నాయని సమాచారం.

యువతిపై గ్యాంగ్​రేప్
మరోవైపు, ఝార్ఖండ్​లోని పశ్చిమ సింగ్భూమ్ జిల్లా ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. తన కాబోయే భర్తతో కలిసి ఓ గ్రామానికి వచ్చిన సమయంలో ఆమెపై ఈ దారుణం జరిగింది. ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు 24 గంటల్లో అరెస్ట్ చేశారు.

గురువారం సాయంత్రం 6 గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. గ్రామంలో యువతిని చూసిన కొందరు యువకులు.. ఆమెను లైంగికంగా వేధించి అనంతరం సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఐదుగురు ఈ దారుణానికి తెగబడ్డారని బాధితురాలు చెప్పిందని జిల్లా ఎస్పీ అశుతోష్ శేఖర్ తెలిపారు. ఘటన అనంతరం నిందితులు.. యువతి బ్యాగు, మొబైల్, డబ్బు లాక్కొని పారిపోయారని చెప్పారు. యువతి వాంగ్మూలం సేకరించిన అనంతరం.. ఆమెకు వైద్య పరీక్షలు చేయించినట్లు వివరించారు. నిందితులను అరెస్ట్ చేశామన్న పోలీసులు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

Girl Raped And Killed : చాక్లెట్​ ఇస్తానని నమ్మించి ఆరేళ్ల బాలికపై హత్యాచారం.. సినీ ఫక్కీలో స్కెచ్​ వేసి నిందితుడు అరెస్ట్​

College Student Kidnapped and Raped : విద్యార్థిని కిడ్నాప్, రేప్.. నగ్నంగా ఫొటోలు తీసి బెదిరింపులు

ABOUT THE AUTHOR

...view details