తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్​కు చేరుకున్న అమెరికా విదేశాంగ శాఖ మంత్రి

అమెరికా విదేశాంగమంత్రి ఆంటోనీ బ్లింకెన్ రెండు రోజుల పర్యటన కోసం దిల్లీ చేరుకున్నారు. ఈ పర్యటనలో ప్రధానంగా భారత్​-అమెరికా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, అఫ్గానిస్తాన్​లో పరిస్థితి, ఇతర అంతర్జాతీయ అంశాలతో పాటు ఉగ్రవాదం లాంటి అంశాలపై చర్చించనున్నారు.

By

Published : Jul 27, 2021, 10:09 PM IST

Updated : Jul 27, 2021, 10:20 PM IST

Antony Blinken
ఆంటోనీ బ్లింకెన్

అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ భారత్‌కు చేరుకున్నారు. రెండు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా బ్లింకెన్‌ దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ప్రధాని నరేంద్ర మోదీ, భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌ జైశంకర్‌తో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ఢోబాల్‌తో భేటీ కానున్నారు. ఈ భేటీల్లో భారత్‌-అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, ఇండో-పసిఫిక్ అంశం, అఫ్గాన్‌ సమస్యలతోపాటు పలు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.

భారత్​కు చేరుకున్న బ్లింకెన్

భారత్‌లో ఆంటోనీ బ్లింకెన్‌ జరుపనున్న తొలి పర్యటన ఇదే కావడం గమనార్హం. అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్‌ పదవీ స్వీకారం చేసిన తరువాత భారత్‌ పర్యటనకు మూడో అత్యున్నత నాయకుడు కూడా ఈయనే. భారత్‌లో రెండు రోజుల పర్యటన అనంతరం ఆయన కువైట్‌ వెళ్లనున్నారు. అమెరికా విదేశాంగ శాఖ మంత్రి భారత్‌లో పర్యటించనున్నారని.. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతమయ్యే అవకాశాలున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ నెల 23న ఓ ప్రకటనలో పేర్కొన్న విషయం తెలిసిందే.

ఇదీ చూడండి:మోదీతో దీదీ భేటీ- కీలకాంశాలపై చర్చ

Last Updated : Jul 27, 2021, 10:20 PM IST

ABOUT THE AUTHOR

...view details