తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వేధింపులు భరించలేక దళిత విద్యార్థిని ఆత్మహత్య.. హాస్టల్​లో విగతజీవిగా మరొకరు! - dalit girl suicide

Dalit Girl Cummits Suicide: ఓ యువకుడి వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంది దళిత విద్యార్థిని. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని పీలీభీత్​లో జరిగింది. ఓ ప్రైవేట్​ స్కూల్​ హాస్టల్​ లోపల 12వ తరగతి విద్యార్థిని విగతజీవిగా కనిపించిన ఘటన తమిళనాడులో జరిగింది.

Upset over repeated molestation Dalit girl student cummits suicide in Pilibhit
Upset over repeated molestation Dalit girl student cummits suicide in Pilibhit

By

Published : Jul 25, 2022, 2:22 PM IST

Dalit Girl Cummits Suicide: ఓ యువకుడి వేధింపులతో మనస్తాపానికి గురైన దళిత విద్యార్థిని.. ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉత్తర్​ప్రదేశ్​ పీలీభీత్​లో జరిగింది. సున్​గఢీ పోలీస్​ స్టేషన్​ పరిధిలో.. ఆదివారం అర్ధరాత్రి తర్వాత బాలిక చనిపోయినట్లు తెలుస్తోంది. ఉరికి వేలాడుతున్న కుమార్తెను చూసిన కుటుంబ సభ్యులు.. పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు.

21 ఏళ్ల ఓ యువకుడు.. తమ కుమార్తెను పలుమార్లు వేధించాడని బాధితురాలి కుటుంబసభ్యులు ఆరోపించారు. అతడిని హెచ్చరించినా వినలేదని చెప్పారు. నిత్యం చేసే వేధింపులు భరించలేకే మనస్తాపంతో తమ కుమార్తె ఆత్మహత్య​ చేసుకుందని వాపోయారు. మరోవైపు.. ఈ ఘటనపై బాధితురాలి కుటుంబం నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. ఫిర్యాదు చేస్తే నిందితులను పట్టుకుంటామని వివరించారు.

హాస్టల్​లో శవమై కనిపించిన విద్యార్థిని..ఓ ప్రైవేట్​ స్కూల్​ హాస్టల్​ లోపల 12వ తరగతి విద్యార్థిని విగతజీవిగా కనిపించడం కలకలం రేపింది. తమిళనాడు తిరువల్లూర్​ జిల్లా కిలాచెరిలో ఈ ఘటన జరిగింది. పాఠశాల పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు.. బాధితురాలి తల్లిదండ్రులు, బంధువులు టెక్కలూర్​ వద్ద ధర్నాకు దిగారు.

భారీగా మోహరించిన పోలీసులు
బాధితురాలి కుటుంబసభ్యుల ఆందోళన

ఇవీ చూడండి:మద్యపానానికి బదులు.. గంజాయిని ప్రోత్సహించాలి: భాజపా ఎమ్మెల్యే

చెట్టుకు వేలాడుతూ ముగ్గురు బాలికల మృతదేహాలు.. ఏం జరిగింది?

ABOUT THE AUTHOR

...view details