తెలంగాణ

telangana

ETV Bharat / bharat

స్నేహితులతో కలిసి విద్యార్థినిపై జవాను గ్యాంగ్​రేప్​ - Muzaafarnagar gangrape

woman gang raped by soldier: ఉత్తర్​ప్రదేశ్​లో అమానుష ఘటన జరిగింది. సెలవులపై ఇంటికి వచ్చిన ఓ జవాను కళాశాల విద్యార్థినిపై అత్యాచారం చేశాడు. తన స్నేహితులతో కలిసి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు.

rape on girl student
అత్యాచారం

By

Published : Mar 6, 2022, 3:22 PM IST

UP Rape Case: ఉత్తర్​ప్రదేశ్​లో దారుణం జరిగింది. సెలవులపై ఇంటికి వచ్చిన ఓ జవాను.. తన స్నేహితులతో కలిసి కళాశాల విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ముజఫర్​పుర్​ సర్దానా గ్రామంలో మార్చి 3న ఈ ఘటన జరిగింది.

woman gang raped by soldier:

ముజఫర్​పుర్​లో బీఏ మూడో సంవత్సరం చదువుతున్న యువతి.. కాలేజీకి వెళ్లి ఇంటికి వస్తున్న సమయంలో నిందితుడు అడ్డగించాడు. మాటలతో మభ్యపెట్టి దిల్లీకి తీసుకెళ్లారు. అనంతరం తన స్నేహితులతో కలిసి అత్యాచారం చేశారు.

గదిలో బంధించి హింసించారని బాలిక తన తల్లిదండ్రులకు తెలిపింది. నిందితుల నుంచి తప్పించుకున్నానని వెల్లడించింది. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితుడిని శివగా గుర్తించారు. అతని స్నేహితులను అరుణ్​, వరుణ్​, అన్షు, సుమిత్​గా గుర్తించారు. దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.

ఇదీ చదవండి:సహచరుడి కాల్పుల్లో ఐదుగురు బీఎస్​ఎఫ్​ జవాన్లు మృతి

టాటూల కోసం వెళ్తే లైంగిక వేధింపులు.. నిందితుడు అరెస్ట్​

ABOUT THE AUTHOR

...view details