తెలంగాణ

telangana

ETV Bharat / bharat

యూపీ మంత్రి విజయ్ కశ్యప్ కరోనాతో మృతి

ఉత్తర్​ప్రదేశ్ మంత్రి, భాజపా సీనియర్ నేత విజయ్ కశ్యప్ కొవిడ్​తో మృతిచెందారు. ఆయన మృతిపట్ల సంతాపం తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ.

vijay kashyap
విజయ్ కశ్యప్, యూపీ మంత్రి

By

Published : May 19, 2021, 5:45 AM IST

ఉత్తర్​ప్రదేశ్​ మంత్రి, భాజపా సీనియర్ నేత విజయ్ కశ్యప్ కరోనా కారణంగా మృతిచెందారు. గురుగావ్ మేదాంతా​ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

56 ఏళ్ల కశ్యప్‌.. ఛరత్వాల్‌ నియోజకవర్గం నుంచి యూపీ శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. యూపీ మంత్రుల్లో కరోనాతో ప్రాణాలు విడిచిన మూడో వ్యక్తి కశ్యప్‌. గతేడాది మంత్రులు కమల్‌ రాణి వరుణ్, చేతన్‌ చౌహాన్ కరోనా సోకి మరణించారు.

కశ్యప్ మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోదీ, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్​ షా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

విజయ్ కశ్యప్ మృతి చాలా బాధాకరం అని ప్రధాని మోదీ అన్నారు. ప్రజల కోసం నిరంతరం పాటు పడే నేత విజయ్ అని గుర్తుచేసుకున్నారు. విజయ్ కుటుంబసభ్యులకు సంతాపం తెలిపారు.

పార్టీ కోసం, ప్రజల కోసం విజయ్ నిరంతరం శ్రమించేవారని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. కశ్యప్ మృతిపట్ల అమిత్​షా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:జులైలో సీబీఎస్‌ఈ 'పది' ఫలితాలు

ABOUT THE AUTHOR

...view details