14ఏళ్ల బాలికను అపహరించి బలవంతంగా మత మర్పిడి చేసి వివాహం చేసుకున్న యువకుడిని ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పుర్ పోలీసులు అరెస్టు చేశారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు ఇటీవల తీసుకువచ్చిన మతమార్పిడి వ్యతిరేక చట్టం కింద కేసు నమోదు చేశారు.
బిహార్ నుంచి వలస వచ్చి షాపూర్లో నివసిస్తున్న తబారక్ ఖాన్(23) అనే యువకుడు.. ఆరో తరగతి చదువుతున్న తన కూతురుని హింసిస్తున్నాడని బాలిక తల్లి ఆరోపించింది. మూడు రోజుల క్రితం కూతురు స్కూల్ బ్యాగ్లో 'నిఖానామా' (పెళ్లి పత్రం) అనే పత్రాన్ని కనుగొన్నట్లు వెల్లడించింది. కూతురుని ప్రశ్నించగా.. మార్చి 1న తబారక్ అపహరించి వివాహం చేసుకుని.. ఇంటి వద్ద వదిలివెళ్లాడని కూతురు వెల్లడించినట్లు పోలీసులకు తల్లి తెలిపింది. నిఖా నామాను పోలీసు స్టేషన్కు తీసుకువచ్చింది.