మైనర్ వివాహితపై ఐదుగురు దుండగులు అత్యాచారం చేసిన ఘటన రాజస్థాన్‌లోని అల్వార్‌లో జరిగింది. ఈ ఘటన జూన్ 12న జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రామగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో జూన్ 12 రాత్రి ఇంటి మిద్దెపై పడుకునేందుకు భార్యాభర్తలు ఇద్దరు వెళ్లారు. ఈ క్రమంలోనే పక్క డాబా పైన నిద్రిస్తున్న ఐదుగురు యువకులు అర్ధరాత్రి కత్తితో బెదిరించి.. ఆమెపై అత్యాచారం చేశారు. వారి కదలికలతో భర్తకు మెలుకువ రావటం వల్ల నిందితులు గోడ దూకి పారిపోయారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. వైద్య పరీక్షలు నిర్వహించి దర్యాప్తు చేపట్టారు.
పదేళ్ల బాలికపై గ్యాంగ్‌రేప్: ఉత్తర్‌ప్రదేశ్ బిసల్పుర్లో దారుణం జరిగింది. పదేళ్ల బాలికపై ముగ్గరు వ్యక్తులు కలిసి గ్యాంగ్ రేప్ చేశారు. ఈ ఘటన మే 15న జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక తన ఇంటి ముందు ఆడుకుంటుండగా.. ఖుర్జాల్, జితేంద్ర, వీరేంద్ర అనే ముగ్గురు నిందితులు పొలాల్లోకి ఎత్తుకెళ్లారు. ఆమెపై అత్యాచారం చేసి అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. తర్వాత గ్రామస్థులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మొదట కేసు పెట్టేందుకు ప్రయత్నించగా పోలీసులు పట్టించుకోలేదని బాలిక తల్లి వాపోయింది. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.