UP Election 2022: ఉత్తరప్రదేశ్‌లో భాజపాను గద్దెదించి మరోసారి అధికారంలోకి రావాలని భావిస్తున్న సమాజ్‌వాదీ పార్టీకి చేయూత లభించింది. యూపీ శాసనసభ ఎన్నికల్లో ఎస్పీ- రాష్ట్రీయ లోక్‌దళ్ కూటమికి భారతీయ కిసాన్ యూనియన్ నేత జాతీయ అధ్యక్షుడు నరేశ్ టికాయిత్ మద్దతు ప్రకటించారు. ఉత్తర్‌ప్రదేశ్ ప్రజలు ఈ కూటమికి మద్దతు తెలుపుతారని ఆశిస్తున్నట్లు తెలిపారు.
ఎస్పీ- ఆర్ఎల్డీ కూటమి శనివారం రెండో విడత అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో ఉన్న ఏడుగురు అభ్యర్థులూ ఆర్ఎల్డీకి చెందిన వారే. ఇందుకు సంబంధించిన వివరాలు ఆల్ఎల్డీ సోషల్ మీడియాలో షేర్ చేసింది.