బోరుబావిలో పడి మరో పసిప్రాణం బలైపోయింది. ఉత్తర్ప్రదేశ్ మహోబా జిల్లా బుదౌరాలో బుధవారం బోరుబావిలో పడిన నాలుగేళ్ల బాలుడి మృతదేహాన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెలికితీశాయి.
బోరుబావిలో పడిన నాలుగేళ్ల చిన్నారి మృతి
ఉత్తర్ప్రదేశ్ మహోబా జిల్లా బుదౌరా గ్రామంలో బోరుబావిలో పడిన నాలుగేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది 20 గంటలపాటు శ్రమించినప్పటికీ ఫలితం దక్కలేదు.
చిన్నారి మృతి.. 20 గంటలు శ్రమించినా దక్కని ఫలితం
ఆక్సిజన్ అందకపోవడం వల్లే బాలుడు మృతి చెందినట్లు ప్రాథమికంగా గుర్తించారు వైద్యులు.
ఎన్డీఆర్ఎఫ్, స్థానిక పోలీసులు, అగ్నిమాపక దళం.. బాలుడ్ని రక్షించేందుకు 20 గంటలపాటు తీవ్రంగా శ్రమించాయి.