Ambulance Siren For Mirchi Buzzi In Hyderabad : ఆపదలో ఉన్న వారిని ఆదుకునేవి అంబులెన్స్‌లు.. వాటి సేవలతో ఎంతో మంది ప్రాణాలు నిలిచాయి. సైరన్ మోగిందంటే చాలు ఎవరో చావుబతుకులు మధ్య ఉన్నారని భావించి.. రహదారులపై వెళ్లే వాహనదారులు అంబులెన్స్‌కు సైడ్ ఇస్తారు. అయితే కొందరు ఈ అవకాశం వాడుకుని.. అవసరం లేనప్పుడు కూడా అంబులెన్స్ సైరన్లను మోగిస్తూ ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నారు. ఇంక ఈ అంబులెన్స్‌లకు సైడ్ ఇవ్వడం కూడా తప్పే అనే రీతిలోకి ప్రజలు వచ్చే విధంగా వారి చేష్టలతో విసుగెత్తిస్తున్నారు. తాజాగా కేవలం మిర్చీ బజ్జీ కోసం అంబులెన్స్ డ్రైవర్ తన విధులను దుర్వినియోగం చేశారు. ఈ సంఘటన ఎక్కడో కాదు.. మన హైదరాబాద్‌లోనే జరిగింది. దీనిపై రాష్ట్ర డీజీపీ కూడా గరంగరం అయి.. సీరియస్‌గా ట్వీట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చూస్తే.. నగరంలో మిర్చీ బజ్జీలు కొనడానికి ఓ అంబులెన్స్ డ్రైవర్ సైరన్ వేసి మరి అంబులెన్స్‌ను వేగంగా తీసుకెళ్లాడు. నారాయణగూడ కూడలి వద్ద రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. సెంచురీ ఆస్పత్రికి చెందిన అంబులెన్స్, సైరన్ వేసుకొని వేగంగా వస్తుండటంతో సిగ్నల్ వద్ద విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ వెంటనే అప్రమత్తమయ్యాడు.
Anjani Kumar Tweet For Ambulance Siren : మిగతా వాహనాలను ఆపి అంబులెన్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. డ్రైవర్ వేగంగా అంబులెన్స్‌ను ముందుకు పోనిచ్చి.. కాస్త దూరంలో రహదారి పక్కన నిలిపాడు. సైరన్ వేసుకొని వేగంగా వెళ్లిన అంబులెన్స్, ఆస్పత్రికి కాకుండా ఇక్కడ ఎందుకు ఆపారని ట్రాఫిక్ కానిస్టేబుల్‌కు అనుమానం వచ్చింది.