బహిరంగ మలవిసర్జనకు(Open Defecation Free) వ్యతిరేకంగా మధ్యప్రదేశ్లోని ఓ గ్రామంలో అధికారులు వినూత్న ప్రచార కార్యక్రమం చేపట్టారు. నీళ్ల చెంబును చేతుల్లో పట్టుకుని పరిగెత్తే పోటీని నిర్వహించారు. భోపాల్ జిల్లాలోని(Madhya Pradesh Bhopal News) ఫందా కలా గ్రామంలో ఈ కార్యక్రమం జరిగింది. 'లోటా దౌడ్' పేరుతో ఈ పోటీని నిర్వహించారు.
ఈ పోటీలో 18 మంది మహిళలు పాల్గొన్నారు. నీళ్ల చెంబును పట్టుకుని వారంతా పరిగెత్తారు. తమ కోడళ్లను బహిరంగ మల విసర్జన నుంచి దూరం చేసి, టాయిలెట్ల వినియోగాన్ని ప్రోత్సహించేందుకుగాను(Open Defecation Free) వాళ్లు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. శౌచాలయాలు లేకపోవడం వల్ల తాము ఎదుర్కొన్న ఇబ్బందులను ఇలా తెలియజేశారు.
"అంతకుముందు శౌచాలయాలు ఉండేవి కావు. అత్తమ్మలు మల విసర్జన కోసం పొలాల్లోకి వెళ్లేవారు. కానీ, ఇప్పుడు వారు తమ ఇళ్లలో టాయిలెట్లను నిర్మించుకున్నారు. ప్రభుత్వం నీళ్లు సరఫరా చేస్తోంది. అందుకే ఇప్పుడు వారంతా తమ కోడళ్లను శౌచాలయాన్ని వినియోగించాలని, గౌరవంతో జీవించాలని కోరుతున్నారు."
-వికాస్ మిశ్రా, భోపాల్ జిల్లా పంచాయతీ సీఈఓ