కేంద్ర వ్యవసాయ, ఆహార శుద్ధి శాఖ సహాయ మంత్రి సంజీవ్ బాల్యన్‌కు కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు బాల్యన్.
"బంగాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పుడు నాకు వైరస్ లక్షణాలు కనిపించాయి. ఆ తర్వాత పరీక్షలు చేయించుకోగా.. కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. దీంతో నేను స్వీయ నిర్బంధంలోకి వెళ్లాను."