తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'న్యాయమూర్తులపై దూషణలు.. ఏమాత్రం మంచిది కాదు' - న్యాయవ్యవస్థ గురించి కేంద్ర మంత్రి రవి శంకర్​ ప్రసాద్​

తమకు నచ్చిన విధంగా తీర్పులు రాకపోతే.. న్యాయమూర్తులను లక్ష్యంగా చేసుకొని సామాజిక మాధ్యమాల్లో కొంతమంది దూషణలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కేంద్ర న్యాయ, ఐటీ శాఖల మంత్రి రవిశంకర్​ ప్రసాద్​. న్యాయవ్యవస్థ పనిచేస్తూ తన విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించాలంటే దానికి  పూర్తి స్వేచ్ఛనివ్వాలని పేర్కొన్నారు.

union minister ravi shnakar prasad
'న్యాయమూర్తులపై దూషణలు.. ఏమాత్రం మంచిది కాదు'

By

Published : Mar 28, 2021, 6:59 AM IST

కొందరు వ్యక్తులు కోర్టుల్లో తమకు నచ్చిన విధంగా తీర్పులు రాకపోతే న్యాయమూర్తులను లక్ష్యంగా చేసుకొని దూషణలకు దిగుతున్నారని కేంద్ర న్యాయ, ఐటీ శాఖల మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ ఆవేదన వ్యక్తంచేశారు. ఈ ధోరణి ఏమాత్రం మంచిది కాదన్నారు. పణజీ సమీపంలోని పోరివోరియంలో రూ.120 కోట్ల వ్యయంతో నిర్మించిన బాంబే హైకోర్టు గోవా బెంచ్‌ నూతన భవనాల ప్రారంభోత్సవంలో శనివారం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఎ.బోబ్డే, తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా నియామక సిఫారసు పొందిన జస్టిస్‌ ఎన్వీ రమణ, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ తదితరులు పాల్గొన్నారు.

"నేను సామాజిక మాధ్యమాలకు గొప్ప మద్దతుదారుడిని. అది సాధికారత కల్పిస్తోంది. ప్రజలకు ప్రశ్నించే అవకాశాన్ని కల్పిస్తోంది. ప్రధానమంత్రితో సహా అందర్నీ విమర్శించే వేదికగా నిలుస్తోంది. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యంలో అదో భాగం. అందువల్ల మేం దాన్ని ప్రోత్సహించాం. కానీ ఇప్పుడు ఆందోళనకరమైన పరిస్థితులను గమనిస్తున్నాం. కొందరు కోర్టుల్లో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలుచేసి, ఆ తర్వాత ఈ కేసులో ఇలాంటి తీర్పురావడానికి అవకాశం ఉందని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం ప్రారంభిస్తున్నారు. కోరుకున్న విధంగా తీర్పు రాకపోతే వారు న్యాయమూర్తులను విమర్శించడమే కాకుండా వారిని దూషించడం (ట్రోలింగ్‌) మొదలుపెడుతున్నారు. తీర్పును విమర్శించే హక్కు అందరికీ ఉంటుంది. కానీ సామాజిక మాధ్యమాల్లో న్యాయమూర్తిని లక్ష్యంగా చేసుకొని ప్రచారం మొదలుపెట్టడం ఏమాత్రం న్యాయంకాదు. న్యాయవ్యవస్థ పనిచేస్తూ తన విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించాలంటే దానికి పూర్తి స్వేచ్ఛనివ్వాలి. న్యాయమూర్తులంతా న్యాయనిబంధనలు, రాజ్యాంగం, ఆత్మసాక్షి ప్రకారం తీర్పులిస్తారు. అందువల్ల న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా ప్రచారం ఏమాత్రం ఆమోదయోగ్యంకాదు."

-రవిశంకర్​ ప్రసాద్​, కేంద్ర న్యాయ, ఐటీ శాఖల మంత్రి

ఇదీ చూడండి:బంగ్లా పర్యటన పూర్తి.. భారత్​కు మోదీ

ABOUT THE AUTHOR

...view details