తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దక్షిణాది రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యమంత్రి కీలక సూచనలు - Union Health Minister reviewed covid situation in southern states

Covid Situation in Southern States: దక్షిణాది రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులు, టీకా పంపిణీలో పురోగతి, వైరస్​పై పోరుకు చేసిన ఏర్పాట్లను సమీక్షించారు కేంద్ర ఆరోగ్యమంత్రి మన్​సుఖ్​ మాండవీయ. కొవిడ్​ నిర్వహణకు కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయాన్ని ప్రశంసించారు.

covid situation in southern states
covid situation in southern states

By

Published : Jan 28, 2022, 7:48 PM IST

Covid Situation in Southern States: ఎనిమిది దక్షిణాది రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులు, టీకా పంపిణీలో పురోగతి, వైరస్​పై పోరుకు రాష్ట్రాలు చేసిన ఏర్పాట్లను సమీక్షించారు కేంద్ర ఆరోగ్యమంత్రి మన్​సుఖ్​ మాండవీయ. ఈ సందర్భంగా కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై దృష్టిసారించాలన్నారు.

కరోనా కట్టిడికి పరీక్షల నిర్వహణ, ట్రేసింగ్, చికిత్స, కొవిడ్​ నిబంధనలు పాటించడం, వ్యాక్సినేషన్ ప్రక్రియ.. ఐదంచెల వ్యూహాన్ని కఠినంగా అమలు చేయాలని ఆయా రాష్ట్రాలకు సూచించారు. భారత్​ లాంటి అధిక జనాభా ఉన్న దేశంలో టీకాల పంపిణీ విజయవంతంగా సాగుతుందన్నారు. పరస్పర అవగాహనతో పాటు కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయంతో ఇది సాధ్యపడిందన్నారు.

మరికొన్ని రాష్ట్రాలతో భేటీ

పలు రాష్ట్రాల్లో ఒమిక్రాన్​ వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో.. బిహార్, ఒడిశా, ఝార్ఖండ్‌, బంగాల్​, ఛత్తీస్​గడ్​ రాష్ట్రాల్లో కొవిడ్​ పరిస్థితి, వైద్య సదుపాయాలను కేంద్ర ఆరోగ్య మంత్రి సమీక్షించనున్నారు. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ఆయా రాష్ట్రాల అధికారులతో భేటీ కానున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి:అక్రమ నిర్మాణాన్ని అడ్డుకున్నారని మర్మాంగాన్ని చూపిస్తూ..

ABOUT THE AUTHOR

...view details