మహారాష్ట్ర ఔరంగాబాద్‌లో అమానుషం జరిగింది. భార్యాభర్తల గొడవ ఓ ఏడాదిన్నర వయసున్న చిన్నారి ప్రాణాల్ని బలిగొంది.
గంగాపుర్ తాలుకా భేందాలా గ్రామానికి చెందిన ఓ మైనర్, ఓ మహిళను వివాహం చేసున్నాడు. అప్పటికే ఆమెకు ఓ కూతురు ఉంది ఉంది. కొద్ది రోజులు సఖ్యతగా ఉన్న దంపతులు గొడవ పడ్డారు. దాంతో కోపంలో భార్య ఇంటిని వదిలి వెళ్లిపోయింది. ఆమె భర్త ఆగ్రహంతో చిన్నారిని పొలంలోకి తీసుకెళ్లి గొంతునులిమి చంపేశాడు. శవాన్ని అక్కడే పూడ్చి పెట్టాడు. ఆ మరునాడే పోలీసుల ముందు లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకుని పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.