ఐరాస పర్యావరణ మార్పులపై సదస్సు(COP26)ను ముందుకు తీసుకెళ్లటం సహా.. వివిధ అంతర్జాతీయ సమస్యలపై భారత్తో కలిసి సంఘటితంగా పనిచేస్తాని బ్రిటన్ వెల్లడించింది. జీ-7 శిఖరాగ్ర సదస్సు ముగిసిన తర్వాత ఈ వ్యాఖ్యలు చేశారు భారత్లో బ్రిటన్ తాత్కాలిక హైకమిషనర్ జాన్ థాంప్సన్.
" యూకే ఆతిథ్యంలో నిర్వహించిన జీ7 సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా హాజరవటం మాకు ఎంతో సంతోషాన్నిచ్చింది. ఆరోగ్యం, వాతావరణం, బహిరంగ సమాజం వంటి వాటిపై చేపట్టిన చర్చల్లో పాల్గొన్నారు. భారత్తో పాటు పాల్గొన్న సభ్యులందరూ.. ప్రజాస్వామ్య విలువలను కాపాడతామని భరోసా కల్పిస్తూ బహిరంగ ప్రకటనపై సంతకం చేశారు. ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయటం, కొవిడ్-19తో ఏర్పడిన సంక్షోభం ఎప్పుడూ ఎదురవకుండా గట్టి చర్యలు చేపట్టేందుకు జీ7 నేతలు అంగీకరించారు. దానికి మద్దతుగా వచ్చే ఏడాదిలోపు యూకే 100 మిలియన్ డోసులను అందించనుంది. "
- జాన్ థాంప్సన్, భారత్లో బ్రిటన్ రాయబారి