తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఫేస్​బుక్​లో ప్రేమ.. కాసేపట్లో పెళ్లి​.. అంతలోనే వరుడు మృతి - కారు ప్రమాదం

ఫేస్​బుక్​లో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఒకటయ్యేందుకు ఇరువురి కుటుంబాలను ఒప్పించారు. వివాహానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ, విధి వారిని ఓడించింది. కొత్త జీవితంలో అడుగుపెట్టేందుకు కొద్ది గంటల ముందు జరిగిన ప్రమాదం వారిని విడదీసింది. ఆదివారం ఉదయం రాజస్థాన్​లోని కోటా వద్ద కారు నదిలోకి దూసుకెళ్లి మృతి చెందిన వరుడి కథే ఇది.

groom accident
ఫేస్​బుక్​లో ప్రేమ

By

Published : Feb 20, 2022, 8:09 PM IST

రాజస్థాన్​లోని కోటా వద్ద ఆదివారం ఉదయం కారు నదిలోకి దూసుకెళ్లి పెళ్లి కొడుకు సహా మొత్తం తొమ్మిది మంది మృతి చెందారు. ఈ ప్రమాదం ఇరు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. వధూవరుల ప్రేమ కథ తెలిసి బంధువులు, స్నేహితులు కన్నీటి పర్యంతమయ్యారు.

మధ్యప్రదేశ్​, ఉజ్జయిన్​లోని భైరు నాలా ప్రాంతానికి చెందిన సుభాష్​ కలోశియాకు ముగ్గురు కుమార్తెలు. చిన్న కూతురు జయాకు ఫేస్​బుక్​ ద్వారా రాజస్థాన్​, చౌత జిల్లాలోని బరవాఢా ప్రాంతానికి చెందిన అవినాశ్​ వాల్మీకి పరిచయమయ్యాడు. ఇరువురి మధ్య స్నేహం ప్రేమగా మారింది. వారి పెళ్లికి ఇరుకుటుంబాలు అంగీకరించటం వల్ల వివాహానికి ముహుర్తం ఖరారు చేశారు.

ఫేస్​బుక్​లో ప్రేమ

ముగ్గురు కుమార్తెల పెళ్లి ఒకే రోజు..

ముగ్గురు కుమార్తెల వివాహాన్ని ఒకేరోజు నిర్వహించేందుకు నిశ్చయించారు సుభాష్​. మొదటి ఇద్దరు కూతుళ్ల బరాత్​.. శనివారం సాయంత్రానికే ఉజ్జయిన్​లోని విష్ణువాటికాకు చేరుకుంది. అయితే, చిన్న కుమార్తె జయ బరాత్​.. రాజస్థాన్​, చౌతలోని బర్వాడా నుంచి రాత్రి 2 గంటలకు ప్రారంభమైంది. ఈ క్రమంలోనే కోటాకు చేరుకున్న క్రమంలో ఆదివారం తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో ప్రమాదానికి గురైంది.

కారుపై డ్రైవర్​ నియంత్రణ కోల్పోవటం వల్ల వంతెన పై నుంచి చంబల్​ నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో వరుడు అవినాశ్​తో పాటు మొత్తం 9 మంది జలసమాధి అయ్యారు. మృతులంతా 35 ఏళ్లలోపు వారే కావటం గమనార్హం.

మరోవైపు.. ఈ ప్రమాదం జరిగినప్పటికీ ఇద్దరు పెద్ద కుమార్తెల వివాహ తంతు పూర్తి చేసినట్లు సమాచారం. కానీ, పెళ్లి పందిరిలో ఆ సంతోషమే లేకుండా పోయింది.

ఇదీ చూడండి:నదిలోకి దూసుకెళ్లిన కారు.. పెళ్లి కుమారుడు సహా తొమ్మిది మంది మృతి

ABOUT THE AUTHOR

...view details