తెలంగాణ

telangana

By

Published : Mar 23, 2021, 8:39 AM IST

Updated : Mar 23, 2021, 9:14 AM IST

ETV Bharat / bharat

'ఉద్ధవ్​కు సీఎంగా కొనసాగే అర్హత లేదు'

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్​ఠాక్రేకు మరొక్క క్షణం కూడా పదవిలో కొనసాగే అర్హత లేదన్నారు కేంద్రమంత్రి ప్రకాశ్​ జావడేకర్​. ముఖేశ్​ అంబానీ ఇంటి సమీపంలో పేలుడు పదార్థాలతో నిలిపి ఉంచిన కారు కేసులో పోలీసు అధికారుల ప్రమేయంపై మాట్లాడిన ఆయన.. నైతిక బాధ్యతగా సీఎం వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్​ చేశారు.

Uddhav Thackeray has no right to continue as CM: Javadekar
'ఉద్ధవ్​కు సీఎంగా కొనసాగే అర్హత లేదు'

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్​ఠాక్రే తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని కేంద్ర మంత్రి ప్రకాశ్​ జావడేకర్​ డిమాండ్​ చేశారు. ఆంటిలియా వద్ద వెలుగు చూసిన పేలుడు పదార్థాల కేసుపై మాట్లాడారు. పోలీసులే ఇలా బాంబులు పెట్టడం ఇప్పటి వరకు ప్రపంచంలో ఎక్కడా చూడలేదని అన్నారు. ఈ విషయమై ఠాక్రే మరొక్క క్షణం కూడా సీఎంగా కొనసాగే అర్హత లేదని విమర్శించారు.

"ఓ పోలీసు ఉద్యోగే బాంబులు పెట్టడం సామాన్యమైన విషయం కాదు. అత్యంత నమ్మకస్తులైన పోలీసులే ఇలా చేస్తే ఎవరిని నమ్మాలి? ఇదంతా జరుగుతుంటే మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక దళం ఏం చేస్తుంది? ముఖ్యమంత్రి ఉద్ధవ్​ఠాక్రే వెంటనే రాజీనామా చేయాలి."

- ప్రకాశ్​ జావడేకర్​, కేంద్రమంత్రి

ఫిబ్రవరి 25 న ముంబయిలోని ముఖేష్ అంబానీ ఇంటి సమీపంలో నిలిచి ఉంచిన కారు నుంచి పేలుడు పదార్థాలను గుర్తించిన కేసుతో సంబంధం ఉందన్న ఆరోపణలతో సచిన్​ వాజే అనే పోలీసు అధికారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Last Updated : Mar 23, 2021, 9:14 AM IST

ABOUT THE AUTHOR

...view details