తెలంగాణ

telangana

ETV Bharat / bharat

టైలర్ హత్య: 'నిందితులు ఇద్దరు కాదు.. ఉగ్ర గ్యాంగ్​తో సంబంధాలు!'

Udaipur murder case: రాజస్థాన్​ టైలర్ హత్య కేసులో మరికొందరి ప్రమేయం ఉండొచ్చని ఎన్ఐఏ అనుమానిస్తోంది. ఇది ఉగ్రముఠా పని కాకపోయినా.. అతివాద బృందాల పాత్ర ఉండే అవకాశం ఉందని భావిస్తోంది. ఈ దిశగా విచారణ ముమ్మరం చేస్తోంది.

Udaipur beheading
Udaipur beheading

By

Published : Jun 30, 2022, 9:02 PM IST

Updated : Jun 30, 2022, 10:42 PM IST

Udaipur Tailor murder NIA: రాజస్థాన్​లోని ఉదయ్​పుర్ టైలర్ కన్హయ్యలాల్ హత్య కేసులో ఇద్దరి కంటే ఎక్కువ మంది పాత్ర ఉన్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అనుమానిస్తోంది. ఈ కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించింది. ఘటన వెనక ఉగ్రవాద ముఠా హస్తం లేదని ప్రాథమిక విచారణలో తేలిందని పేర్కొంది. అయితే, స్థానిక అతివాద బృందాల ప్రమేయంపై ఆరా తీస్తున్నట్లు వెల్లడించింది.

"పాకిస్థాన్​కు చెందిన సున్ని ఇస్లామిక్ సంస్థ అయిన 'దావత్ ఇ ఇస్లామి'లో నిందితులు సభ్యులుగా చేరారు. మొబైల్ ద్వారా దరఖాస్తు నింపి సంస్థలో భాగమయ్యారు. నిందితుల్లో ఒకడు పాకిస్థాన్​కు చెందిన వ్యక్తులతో నిరంతరం టచ్​లో ఉన్నాడు. అయితే, ఇప్పుడే దీనిపై ఓ నిర్ధరణకు రాలేం. ప్రాథమిక విచారణలో ఉగ్రవాదుల ముఠా హస్తం ఉండకపోవచ్చని తేలింది. అయితే, ఉగ్ర గ్యాంగ్​ల ప్రమేయంపై విచారణ జరపాల్సి ఉంది. నిందితులు ఉగ్రవాద సంస్థకు చెందినవారని మీడియాలో వచ్చిన వార్తలు కేవలం ఊహాగానాల ఆధారంగా వచ్చినవే."
-ఎన్ఐఏ అధికారులు

కాగా, దావత్ ఇ ఇస్లామ్ సంస్థ రాజస్థాన్​లోని సరిహద్దు గ్రామాలు, పట్టణాల నుంచి రూ.20 లక్షల మేర డొనేషన్లు స్వీకరించింది. ఒక్క నెలలోనే ఇంత మొత్తంలో విరాళాలు ఆ సంస్థకు అందాయని అధికారులు తెలిపారు. ఓ రాజకీయ నాయకుడు రూ.2 లక్షలు ఆ సంస్థకు విరాళం ఇచ్చారు. జైసల్మేర్, బాడ్​మేర్ ప్రాంతాల్లో ఈ సంస్థ పలు తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు గుర్తించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఛారిటబుల్ ఇస్లామిక్ కార్యక్రమాల కోసం వీటిని వసూలు చేస్తున్నట్లు సంస్థ చెబుతోందని వెల్లడించాయి.

మరోవైపు, ఉదయ్​పుర్ కేసు దర్యాప్తును సమగ్రంగా పర్యవేక్షించేందుకు ఎన్ఐఏ కేంద్ర కార్యాలయం నుంచి ఐజీ స్థాయి అధికారి ఉదయ్‌పుర్ వెళ్లారని సంబంధిత వర్గాలు తెలిపాయి. మొత్తం 10 మంది అధికారులు ఉదయ్‌పుర్ వెళ్లారని పేర్కొన్నాయి. నిందితుల మొబైల్ ఫోన్‌లను ఫోరెన్సిక్ పరీక్ష కోసం పంపినట్లు ఎన్ఐఏ సీనియర్ అధికారి వెల్లడించారు. మూడు రోజుల తర్వాతే ఫోరెన్సిక్ నివేదిక వచ్చే అవకాశం ఉందని తెలిపారు. అదుపులోకి తీసుకున్న నిందితులను గురువారమే దిల్లీ తరలించాలని భావించినా.. దర్యాప్తు పురోగతి కోసం ఆపినట్లు సమాచారం. హత్యకు సంబంధించి కేసు విచారణలో నిందితులను చాలా ప్రాంతాలకు తీసుకెళ్లాల్సి రావడం వల్ల.. ప్రస్తుతం వారిద్దరినీ రాజస్థాన్‌లోనే ఉంచినట్లు ఎన్ఐఏ వర్గాలు స్పష్టం చేశాయి.

కాగా, నిందితులు రియాజ్ అఖ్తారి, గౌస్ మహమ్మద్​లకు కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. నిందితులను వ్యాన్​లో తీసుకొచ్చిన సమయంలో న్యాయవాదులు వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఇదీ చదవండి:

Last Updated : Jun 30, 2022, 10:42 PM IST

ABOUT THE AUTHOR

...view details