తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఇద్దరు మహిళా డాక్టర్ల ప్రేమాయణం.. త్వరలోనే పెళ్లి! - ఇద్దరు మహిళా డాక్టర్ల పెళ్లి

Two women doctors marriage: ఇద్దరు యువ మహిళా డాక్టర్లు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. జీవితాంతం కలిసి ఉండాలనుకుంటున్నారు. గోవాలో పెళ్లి చేసుకోబోతున్నారు.

Two women doctors
ఇద్దరు మహిళా డాక్టర్ల ప్రేమాయణం.. త్వరలో పెళ్లి

By

Published : Jan 5, 2022, 2:14 PM IST

Updated : Jan 5, 2022, 3:50 PM IST

Two women doctors wedding: మహారాష్ట్ర నాగ్​పుర్​కు చెందిన ఇద్దరు మహిళా డాక్టర్లు జీవితాంతం కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు. గతవారమే నిశ్చితార్థం చేసుకున్న వారు.. త్వరలోనే గోవాలో పెళ్లి చేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇద్దరి మనసులు కలిశాయని, ఒకరినొకరు అర్థం చేసుకున్నామని.. అందుకే బతికున్నంత వరకు కలిసి ఉండాలనుకుంటున్నట్లు వారు చెప్పారు. ఈ బంధానికి 'లైఫ్​టైమ్ కమిట్​మెంట్'​ అనే పేరు పెట్టుకున్నారు. ఈ వైద్యురాళ్ల పేర్లు పరోమిత ముఖర్జీ, సురభి మిత్ర.

ఇద్దరు మహిళా డాక్టర్ల ప్రేమాయణం
పరోమిత ముఖర్జీ, సురభి మిత్ర

తన లైంగిక ధోరణి గురించి తండ్రికి 2013 నుంచే తెలుసని ఇద్దరు డాక్టర్లలో ఒకరైన పరోమిత ముఖర్జీ తెలిపారు. అయితే తన తల్లికి ఇటీవలే ఈ విషయం చెబితే షాక్​కు గురైందని, కానీ తన సంతోషం కోసం ఆ తర్వాత అంగీకరించిందని చెప్పారు.

ఇద్దరు మహిళా డాక్టర్ల ప్రేమాయణం
ఇద్దరు మహిళా డాక్టర్ల ప్రేమాయణం

తన లైంగిక ధోరణి గురించి కూడా కుటుంబ సభ్యులకు ఎప్పటి నుంచో తెలుసని ఈ జంటలో మరో వైద్యురాలు సురభి మిత్ర వెల్లడించారు. ఈ విషయం గురించి వారికి తెలిసినప్పుడు ఎలాంటి ఆందోళనా చెందలేదని పేర్కొన్నారు. మానసిక వైద్యురాలైన తన వద్దకు ఎంతో మంది వచ్చి ద్వంద్వ జీవితం గురించి చెప్పేవారని, ఏదో ఒక నిర్ణయానికి కట్టుబడి ఉండలేకపోతున్నామనేవారని వివరించారు.

పరోమిత ముఖర్జీ
ఇద్దరు మహిళా డాక్టర్ల ప్రేమాయణం

ఇదీ చదవండి:'బుల్లీబాయ్ యాప్ కేసు'లో మరొకరు అరెస్ట్​.. కేసు 'ఐఎఫ్​ఎస్​ఓ'కు బదిలీ

Last Updated : Jan 5, 2022, 3:50 PM IST

ABOUT THE AUTHOR

...view details