కర్ణాటకలోని బెంగళూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కేఆర్ పురం ఆర్టీవో కార్యాలయం ఎదుట ఓ ఆటోను వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మరణించారు.
పోలీసు వివరాల ప్రకారం..
గురువారం అర్ధరాత్రి.. కేఆర్ పురం మార్గంలోఖలీద్, అతడి భార్య తసీనా, ఫజీలా, ఇద్దరు పిల్లలు ఆటోలో ప్రయాణిస్తున్నారు. ఖలీద్ ఆటోను నడుపుతున్నాడు. ఆ సమయంలో ఇన్నోవా కారు అతివేగంతో వచ్చి ఆటోను బలంగా ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతిచెందారు. రెండేళ్ల చిన్నారికి తీవ్రగాయాలయ్యాయి. మిగిలిన వారు స్వల్పగాయాలతో బయటపడ్డారు.
ఆటోను బలంగా ఢీకొన్న కారు.. అక్కడికక్కడే ఇద్దరు మహిళలు మృతి.. డ్రైవర్ పరార్ - బెంగళూరు లేటెస్ట్ రోడ్డు ప్రమాద వార్తలు
అతి వేగంగా వచ్చిన ఓ ఇన్నోవా కారు.. రోడ్డుపై వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. కర్ణాటకలోని బెంగళూరులో ఈ ప్రమాదం జరిగింది.
ప్రమాదానికి గురైన ఆటో
సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకున్నారు. స్థానికులతో కలిసి క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్పించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కారు డ్రైవరు కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.
"గురువారం రాత్రి 9:20 గంటల ప్రాంతంలో బ్లాక్ కలర్ ఇన్నోవా కారు వేగంగా వచ్చి ఢీకొనడం వల్ల ఈ ఘటన జరిగింది. ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే కారు డ్రైవర్ పారిపోయాడు" అని ప్రత్యక్ష సాక్షి సైఫ్ తెలిపాడు.