ఝార్ఖండ్ జంషెద్పుర్లో(Jharkhand Jamshedpur News) అరుదైన సంఘటన జరిగింది. ఓ మహిళ.. రెండు తలలు ఉన్నట్లుగా(Two Headed Baby) కనిపిస్తున్న ఓ శిశువుకు జన్మనిచ్చింది. దీంతో ఆ శిశువును చూసేందుకు మహిళ ప్రసవించిన ఆస్పత్రికి జనం భారీగా చేరుకున్నారు.
జంషెద్పుర్లోని ఎంజీఎం ఆస్పత్రిలో రాణాదేవీ అనే మహిళ.. సోమవారం ఓ ఆడ శిశువుకు జన్మనిచ్చింది. శిశువుకు తల వెనుక మరో తల ఉన్నట్లుగా(Two Headed Baby) ఆకృతి ఉంది. దీంతో రెండు తలలు ఉన్నట్లుగా ఆ పాప కనిపించింది. స్థానికంగా ఈ వార్త తెగ వ్యాప్తి చెందగా.. శిశువును చూసేందుకు చాలా మంది ఎంజీఎం ఆస్పత్రికి చేరుకున్నారు.
ఆ వ్యాధి వల్లే..
అయితే.. ఆక్సిపిటల్ ఎన్సెఫలోసెల్(occipital encephalocele) అనే అరుదైన వ్యాధి కారణంగానే చిన్నారి ఇలా జన్మించిందని ఎంజీఎం డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నకుల్ చౌదరీ తెలిపారు. శిశువుకు నిజంగా రెండు తలలు లేవని చెప్పారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్యంగానే ఉందని.. ఆమెను ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచినట్లు వెల్లడించారు.
మరికొన్ని రోజుల పాటు చిన్నారిని ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచుతామని చెప్పారు నకుల్ చౌదరీ. ఆ తర్వాత శస్త్రచికిత్స చేసి, తలకు అంటి ఉన్న మిగతా భాగాన్ని తొలగిస్తామని చెప్పారు. రాంచీలోని రిమ్స్ ఆస్పత్రిలో ఈ శస్త్రచికిత్స జరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం తల్లీబిడ్డలు క్షేమంగానే ఉన్నారని పేర్కొన్నారు.
ఇవీ చూడండి: