తెలంగాణ

telangana

ETV Bharat / bharat

యువతుల మధ్య లవ్​.. పెళ్లైందని తెలిసి  చితకబాదిన బంధువులు - వివాహం చేసుకున్న ఇద్దరు యువతులు

ఇద్దరు యువతులు ప్రేమించుకున్నారు. వివాహం కూడా చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న యువతుల బంధువులు వారిని చితకబాదారు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది.

two girls got married
వివాహం చేసుకున్న ఇద్దరు యువతులు

By

Published : Jul 1, 2022, 11:53 AM IST

ప్రేమ.. సాధారణంగా ఈ ఫీలింగ్​ ఓ అమ్మాయి, అబ్బాయి మధ్య పుడుతుంది. కానీ ఇక్కడ ఇద్దరు అమ్మాయిల మనసుల మధ్య చిగురించింది. ఈ క్రమంలో ఆ ఇద్దరు యువతులు వివాహం కూడా చేసుకున్నారు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని మేరఠ్​లో జరిగింది. విషయం తెలుసుకున్న ఇరువురి కుటుంబ సభ్యులు యువతులను చితకబాదారు. ఒక యువతిని బలవంతంగా ఇంటికి తీసుకెళ్లిపోయారు.

అసలేం జరిగిందంటే: మేరఠ్ జిల్లాలోని శాస్త్రినగర్​కు చెందిన ఒక అమ్మాయి, లాల్​కుర్తికు చెందిన మరో అమ్మాయి ఒకే కాలేజీలో బీకాం చదివారు. ఇద్దరు ఒకే రూమ్​లో ఉండేవారు. అప్పుడు వీరి పరిచయం కాస్త ప్రేమగా మారింది. అనంతరం నోయిడాలోని ఓ ప్రైవేట్ కంపెనీకి ఉద్యోగం నిమిత్తం ఇద్దరు యువతులు వెళ్లారు. అక్కడికి వెళ్లాక కొన్నాళ్ల నుంచి కలిసే ఉంటున్నారు. తర్వాత వివాహం చేసుకున్నారు. పెళ్లిని రిజిస్ట్రేషన్ చేసేందుకు పోలీస్​ స్టేషన్​కు వెళ్లగా బంధువులకు విషయం తెలుసుకున్న బంధువులు అక్కడికి చేరుకుని వారిపై దాడి చేశారు. నోయిడా నుంచి ఓ యువతిని లాల్​కుర్తి తీసుకెళ్లిపోయారు. ఈ విషయంపై స్పందించిన పోలీసులు.. ఇద్దరు యువతులకి వారి వివాహం సరికాదని కుటుంబ సభ్యులు ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. యువతులు పెళ్లి చేసుకున్నట్లు కూడా ఎటువంటి ఆధారాలు లేవని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details