తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఫ్లైఓవర్​పై కారు, బైకు ఢీ.. 30 అడుగుల ఎత్తు నుంచి పడి ఇద్దరు... - ఫ్లైఓవర్​పై నుంచి పడ్డ బైకు

ఫ్లైఓవర్​పై వెళ్తున్న ఓ బైకును అతివేగంతో దూసుకొచ్చిన ఓ కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఫ్లైఓవర్​పై​ నుంచి 30 అడుగుల కింద ఉన్న రోడ్డుపై పడి, బైక్​పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు మరణించారు.

accident in bengalore
ఫ్లైఓవర్​పై బైకును ఢీకొన్న కారు

By

Published : Sep 15, 2021, 11:09 AM IST

Updated : Sep 15, 2021, 1:07 PM IST

ఫ్లైఓవర్​పై బైకును ఢీకొన్న కారు

బెంగళూరులో(Karnataka Bangalore News) ఘోర ప్రమాదం జరిగింది. అతివేగంతో దూసుకొచ్చిన ఓ కారు.. బైకును ఢీకొంది. ఈ ఘటనలో ఫ్లైఓవర్​పై(Flyover Bridge) నుంచి ఎగిరి, కింద ఉన్న రోడ్డుపై పడి, ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.

ఎలా జరిగింది?

బెంగళూరులోని ఎలక్ట్రానిక్స్ సిటీ(Bangalore Electronic City) ప్రాంతంలోని ఫ్లైఓవర్​పై.. వేగంగా వెళ్తున్న ఓ కారు బైకును ఢీకొట్టింది. దీంతో బైక్ నడుపుతున్న వ్యక్తితో పాటు, వెనకాల కూర్చున్న మహిళ.. వంతెనపై నుంచి గాల్లోకి ఎగిరి, 30 అడుగుల కింద ఉన్న రోడ్డుపై పడ్డారు. ఈ ఘటనలో వారిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు. మంగళవారం రాత్రి 9:15 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు.

ఫ్లైఓవర్​ బ్రిడ్జిపై నుంచి కిందపడి ప్రాణాలు కోల్పోయిన వ్యక్తులు
ప్రమాదంలో నుజ్జునుజ్జయిన కారు
ఘటనాస్థలిలో ట్రాఫిక్​ జాం
వంతెన అంచుపై వేలాడుతున్న కారు

ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. బైకును ఢీకొన్న కారు.. వంతెన అంచుకు వేలాడుతూ కనిపించిందని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:గుడిసెకు నిప్పంటించి తాత, నానమ్మను కడతేర్చిన మనవడు

ఇదీ చూడండి:బంగారం చోరీ నెపంతో మహిళపై నలుగురు కలిసి...

Last Updated : Sep 15, 2021, 1:07 PM IST

ABOUT THE AUTHOR

...view details