తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు పౌరులు మృతి - జమ్ములో పౌరులపై ఉగ్ర కాల్పులు

జమ్ము కశ్మీర్​ అనంత్​నాగ్ జిల్లాలో ఉగ్రవాదులు(militants) కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు పౌరులు ప్రాణాలు కోల్పోయారు.

terrorists
ఉగ్రవాదులు, కాల్పులు

By

Published : May 29, 2021, 10:19 PM IST

జమ్ముకశ్మీర్​ అనంత్​నాగ్​ జిల్లాలో ఉగ్రవాదులు(militants) రెచ్చిపోయారు. జిల్లాలోని బిజ్​బెహరా జబ్లిపొరా ప్రాంతంలో స్థానిక పౌరులపై కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు పౌరులు ప్రాణాలు కోల్పోయారు.

జబ్లిపోరా ప్రాతంలో కాల్పులకు(Firing) పాల్పడగా.. గాయపడిన ఇద్దరిని ఆసుపత్రికి తరలించే క్రమంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. కొద్ది సేపటికే పరిస్థితి విషమించి మరో వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. బాధితులు సంజీద్ పారీ, షా భట్​గా గుర్తించారు.

ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

ఇదీ చదవండి:బులెట్​ కోసం వరుడి డిమాండ్​ ​- షాక్​ ఇచ్చిన వధువు!

ABOUT THE AUTHOR

...view details