తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కేంద్ర ఐటీ మంత్రికే ట్విట్టర్​ ఝలక్

కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్​ ప్రసాద్​కు ట్విట్టర్ షాక్​ ఇచ్చింది. గంట పాటు మంత్రి ట్విట్టర్​ అకౌంట్​ను బ్లాక్ చేసింది.

twitter, IT minister
రవిశంకర్ ప్రసాద్, ఐటీ మంత్రి

By

Published : Jun 25, 2021, 4:04 PM IST

Updated : Jun 25, 2021, 8:59 PM IST

మైక్రోబ్లాగింగ్ ప్లాట్​ఫార్మ్​ ట్విట్టర్.. కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్​కు ఝలక్ ఇచ్చింది. గంట సమయం పాటు మంత్రి అకౌంట్​ను బ్లాక్​ చేసింది. అమెరికా డిజిటల్ మిలీనియమ్ కాపీరైట్​ యాక్ట్ ఉల్లంఘించారన్న కారణంతో ఖాతాను నిలిపివేసినట్లు పేర్కొంది.

'కూ' వేదికగా..

ట్విట్టర్ చర్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి రవిశంకర్ ప్రసాద్. భారత్​లో కొత్తగా అమల్లోకి వచ్చిన ఐటీ చట్టం ప్రకారం ముందుగా నోటిసులివ్వకుండా అకౌంట్​ను ఎలా నిలిపివేశారని మండిపడ్డారు. సామాజిక మధ్యమం 'కూ' వేదికగా​ పలు పోస్ట్​లు చేశారు. ట్విట్టర్​.. భారత ఐటీ నిబంధనను ఉల్లఘించిందని పేర్కొన్నారు.

గంట తర్వాత తిరిగి తన ఖాతాను ట్విట్టర్​ పునరుద్ధరించిందని మంత్రి తెలిపారు. ఇటీవల ట్విట్టర్​ వివాదంపై టీవీ ఛానళ్లకు ఇచ్చిన ముఖాముఖి వీడియో క్లిప్​లు షేర్​ చేయడం వల్ల ఆ సంస్థ​ ఉక్కిరిబిక్కిరి అయిందని అన్నారు. నూతన ఐటీ చట్టాల విషయంలో న్యాయమపరమైన చర్యలపై తాను చేసిన వ్యాఖ్యలకు మైక్రోబ్లాగింగ్ సంస్థ ఈ విధంగా చేసినట్లు ఆరోపించారు.

'వివరణ ఇవ్వాల్సిందే...'

రవి శంకర్​ ప్రసాద్​ ట్విట్టర్​ ఖాతాను నిలిపివేసిన నేపథ్యంలో.. ఇన్​ఫార్మేషన్​ టెక్నాలజీకి చెందిన పార్లమెంటరీ స్టాండింగ్​ కమిటీ​ ఛైర్మన్​ శశి థరూర్​ స్పందించారు. తనకు కూడా అలాగే జరిగిందని తెలిపారు. తమ ఖాతాలను తాత్కాలికంగా నిలిపివేయటం సహా భారత్​లో పని చేసేటప్పుడు అనుసరించాల్సిన నియమాలపై ట్విట్టర్​ తరఫు నుంచి స్టాండింగ్​ కమిటీ వివరణ తీసుకుంటుందని చెప్పారు.

ఇదీ చదవండి:

Last Updated : Jun 25, 2021, 8:59 PM IST

ABOUT THE AUTHOR

...view details