TS Water Board Letter To Krishna Board on Veligonda Project: ఎలాంటి అనుమతులు లేకుండా వెలిగొండ ప్రాజెక్టుపై (Veligonda Project) ఎత్తిపోతలు, ఇతర కాంపొనెంట్ పనులు చేపట్టకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నిలువరించాలని కృష్ణా నది యాజమాన్య బోర్డును తెలంగాణ ప్రభుత్వం కోరింది. అపెక్స్ కౌన్సిల్, బోర్డు అనుమతులు లేకుండా ఏపీ ప్రభుత్వం కొత్త పనులకు అనుమతులు ఇచ్చిందని కృష్ణా బోర్డుకు తెలంగాణ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ కేఆర్ఎంబీ చైర్మన్‌కు (Krishna River Management Board) లేఖ రాశారు. ఎలాంటి అనుమతులు లేకుండా వెలిగొండ ప్రాజెక్టుపై ఎత్తిపోతలు, ఇతర కాంపొనెంట్ పనులకు పరిపాలనా అనుమతులు ఇచ్చారని అందులో పేర్కొన్నారు.
'శ్రీశైలంలోకి వెలిగొండ మట్టిని తరలించడం ఆపండి'
అనుమతులు లేకుండా బేసిన్ వెలుపలకు కృష్ణా జలాలను (Krishna Water) తరలించడం తగదన్న తెలంగాణ.. కేంద్ర జల శక్తి శాఖ ఆదేశాలను పట్టించుకోకుండా ఏపీ ప్రభుత్వం పనులు చేపడుతోందని ఆక్షేపించింది. వెలిగొండ లాంటి ప్రాజెక్టుల పనులతో తెలంగాణ ప్రాజెక్టులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని... ఫ్లోరైడ్ ప్రభావిత నల్గొండ, కరువు పీడిత ప్రాంతమైన పాలమూరుకు అన్యాయం జరుగుతోందని లేఖలో పేర్కొంది. అనుమతి లేని వెలిగొండ ప్రాజెక్టు, కొత్త కాంపొనెంట్ పనులను ఏపీ చేపట్టకుండా నిలువరించాలని (TS Latter To KRMB) కృష్ణా బోర్డును లేఖలో తెలంగాణ ప్రభుత్వం కోరింది.