భారత్లో జరుగుతోన్న రైతుల ఆందోళనలపై కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో యూటర్న్ తీసుకున్నారు. రైతులతో ప్రభుత్వం వివిధ దశల్లో చర్చలు జరడాన్ని ఆయన ప్రశంసించారు. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ట్రూడో.. ఫోన్లో సంభాషించారని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.
'రైతులతో ప్రభుత్వం చర్చలు జరపడం.. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో సరైన చర్యగా' ట్రూడో పేర్కొన్నారని విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ తెలిపారు.