మహారాష్ట్ర రాయ్‌గఢ్ జిల్లాలో ఓ ట్రక్కు బీభత్సం సృష్టించింది. పాదచారులపైకి వేగంగా దూసుకొచ్చింది. ఈ దుర్ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. జిల్లాలోని రేవ్దండాలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు.
ఘటనాస్థలంలో గుమిగూడిన జనం "ట్రక్కు డ్రైవర్ వాహనంపై నియంత్రణ కొల్పోయాడు. దాంతో రోడ్డు పక్కన నడుచుకుంటు వేళుతున్న 8 మందిపైకి దూసుకెళ్లింది. "
- అధికారులు
క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు అధికారులు. ఎనిమిది మందిలో నలుగురు ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే మరణించినట్లు తెలిపారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు.
ఘటనాస్థలం నుంచి పారిపోయిన ట్రక్కు డ్రైవర్‌ను పోలీసులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చూడండి:'మే నెలలో పార్లమెంటుకు రైతుల పాదయాత్ర'