తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పంచాయతీ సెక్రెటరీగా ట్రాన్స్​జెండర్​.. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి.. - tamilnadu transgender Panchayat Secretary

Tamilnadu Transgender: తమిళనాడులో ఓ ట్రాన్స్​జెండర్ తొలిసారి పంచాయతీ సెక్రటరీగా నియమితులయ్యారు. తమ నైపుణ్యాన్ని గుర్తించి ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.

Transgender sworn as Panchayat Secretary
Transgender sworn as Panchayat Secretary

By

Published : Mar 26, 2022, 2:11 PM IST

Transgender Panchayat Secretary: తమిళనాడు తిరువళ్లూర్​లో పంచాయతీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి.. ట్రాన్స్​జెండర్ చందన్​రాజ్​ దాత్సాయని అరుదైన ఘనత సాధించారు. ఇలా జరగడం రాష్ట్రంలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. బాధ్యతలు చేపట్టిన తొలి రోజే.. ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్​జెండర్లకు కూడా రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రామీణ అభిృవద్ధి శాఖలో ఓ ట్రాన్స్​జెండర్​ విధులు చేపట్టడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు.

పంచాయతీ సెక్రెటరీగా ట్రాన్స్​జెండర్​.. రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్​

చందన్​రాజ్​ 2010లో పూవిరుథవల్లి అన్నంపేడు పంచాయతీ కార్యదర్శిగా నియమితుయ్యారు. అప్పుడు పురుషుడిగానే ఉద్యోగంలో చేరారు. ఆ తర్వాత ట్రాన్స్​జెండర్​గా మరారు. పారిపాలనా కారణాల దృష్ట్యా 2015లో కోసవంపాలయంకు బదిలీ అయ్యారు. అయితే ఆ తర్వాత విధులకు హాజరు కాలేదు. 2020లో మళ్లీ పంచాయతీ కార్యదర్శి పోస్టు కోసం దరఖాస్తు చేసుకున్నారు. మగ నుంచి ట్రాన్స్​జెండర్​గా మారుతున్నందువల్ల మానసిక ఇబ్బందులు తలెత్తి ఆఫీసుకు రాలేకపోయినట్లు దరఖాస్తులో పేర్కొన్నారు.

చందన్​రాజ్​ ఇప్పుడు పూర్తి ట్రాన్స్​జెండర్​గా మారారు. మళ్లీ విధులు నిర్వహించేందుకు సిద్ధం కావడం వల్ల జిల్లా కలెక్టర్​ కూడా మానవతా దృక్పథంతో దరఖాస్తుకు అంగీకారం తెలిపారు. దీంతో ఎల్లాపురంలోని కొడువెలి పంచాయతీ సెక్రెటరీగా చందన్​రాజ్ వాత్సాయనిని తిరిగి నియమించారు. శుక్రవారం విధుల్లో చేరిన అనంతరం చందన్​రాజ్ మీడియాతో మాట్లాడారు. ట్రాన్స్​జెండర్ల టాలెంట్​ను గుర్తించి ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:కూతురు శవాన్ని భుజంపై మోస్తూ 10కి.మీ నడిచిన తండ్రి

ABOUT THE AUTHOR

...view details