తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ట్రాన్స్​జెండర్​ భిక్షాటనతో కిక్​బాక్సింగ్​లో శిక్షణ- జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ - girl won the gold medal in kickboxing

Transgender Mysore: భిక్షాటన చేసే ట్రాన్స్​జెండర్లను చూసి అసహ్యించుకుంటారే గానీ, స్వార్థం లేని వారి మనస్సును అర్థం చేసుకునేవారు తక్కువే. కానీ ఓ ట్రాన్స్​జెండర్​.. అదే భిక్షాటన చేస్తూ తన మనవరాలిని కిక్​బాక్సింగ్​ ఛాంపియన్​గా తీర్చిదిద్దింది.

Mysore girl won the gold medal in kickboxing
Mysore girl won the gold medal in kickboxing

By

Published : Jan 9, 2022, 5:00 PM IST

Transgender Mysore: కర్ణాటక మైసూర్​కు చెందిన ట్రాన్స్​జెండర్​ అక్రమ్​ పాషా అలియాస్​ షబానా ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది. భిక్షాటన చేసి తన మనవరాలిని కిక్​బాక్సింగ్​ ప్లేయర్​గా మార్చింది. ఈ క్రమంలో ఎన్నో కష్టాలను తట్టుకుంది. బాధలను ఓర్చుకుంది. సమస్యలను ఎదుర్కొంది. అదే ఆమె స్థాయిని పెంచింది.

షబానా మనవరాలు ఫాతిమా(15) ఇప్పుడు WAKO ఇండియా కిక్​బాక్సింగ్​ ఛాంపియన్​షిప్​లో బంగారు పతకం సాధించింది.

ఫాతిమాతో ట్రాన్స్​జెండర్​ షబానా

Mysore Girl Won Gold Medal in Kickboxing: ట్రాన్స్​జెండర్​ షబానా ప్రస్తుతం భిక్షాటన చేస్తూనే జీవనం సాగిస్తోంది. తన వృత్తిని కొనసాగిస్తూనే.. ఫాతిమాను చదివించడం సహా మైసూర్​ డిస్ట్రిక్ట్​ కిక్​బాక్సింగ్​ అసోసియేషన్​లో బాక్సింగ్​ శిక్షణ ఇప్పిస్తోంది.

వాకో కిక్​బాక్సింగ్​ ఛాంపియన్​షిప్​ నెగ్గిన ఫాతిమా

9వ తరగతి చదువుతున్న ఫాతిమా గతేడాది డిసెంబర్​ చివరివారంలో పుణెలో జరిగిన ఛాంపియన్​షిప్​లో పాల్గొంది. అండర్​-15 విభాగంలో వాకో ఇండియా కిక్​బాక్సింగ్​ ఛాంపియన్​షిప్​లో గోల్డ్​ మెడల్​ నెగ్గింది.

బంగారు పతకం గెల్చుకున్న ఫాతిమా
గోల్డ్​ మెడల్​ గెల్చుకున్నట్లు ప్రశంసా పత్రం

Shabana needs helping hands:

ఫాతిమాను అంతర్జాతీయ స్థాయి కిక్​బాక్సింగ్​ ప్లేయర్​గా చూడాలనుకుంటోంది షబానా. ఆమె ట్రైనింగ్​ సహా చదువు, ఇతర ఖర్చులు ఈ ట్రాన్స్​జెండర్​కు తలకు మించిన భారంగా మారింది. అందుకే దాతల సాయం కోసం ఎదురుచూస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తోంది.

ఇవీ చూడండి:దేశీయ కృత్రిమ గుండె- ధర చాలా తక్కువండోయ్!

ఇంట్లో నుంచి గెంటేసిన బిడ్డలపై 76 ఏళ్ల తల్లి పోరాటం.. చివరకు..

ABOUT THE AUTHOR

...view details