Train Fire Maharashtra : మహారాష్ట్ర నాందేడ్‌లో పుర్ణ-పర్లి ప్యాసింజర్ ప్యాసింజర్ రైలులో మంటలు చెలరేగాయి. మెయింటెనెన్స్ యార్డ్‌లో నిలిపి ఉన్న రైలులో ఒక్కసారిగా మంటలు సంభవించాయి. సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది, ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. రైలులో మంటలు చెలరేగడం వల్ల సమీపంలోని రైల్వే స్టేషన్లో ఉన్న ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
ఇదీ జరిగింది
నాందేడ్‌లోని హూజుర్ సాహెబ్ రైల్వే స్టేషన్ సమీపంలో ఉదయం 9.30 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. మెయింటెనెన్స్ యార్డ్‌లో నిలిపి ఉన్న రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది, ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. రైల్వే శాఖతో పాటు స్థానిక మున్సిపల్ కార్పొరేషన్‌కు సంబంధించిన అగ్రిమాపక సిబ్బంది ఈ సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఖాళీగా ఉన్న లగేజీ వ్యాన్ కోచ్‌లో మంటలు చెలరేగగా, 30 నిమిషాల్లోనే అదుపులోకి తీసుకువచ్చినట్లు రైల్వే అధికారులు చెప్పారు. ఈ ఘటనలో ఒక్క బోగీ మాత్రమే అగ్నికి ఆహుతైనట్లు వివరించారు. మంటలు వ్యాపించకుండా బోగిని మరో ప్రాంతానికి తరలించినట్లు చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు తెలిపారు.
ఒకదానితో ఒకటి ఢీ కొని ఆరు వాహనాలు దగ్ధం- ముగ్గురు సజీవ దహనం
Madhya Pradesh Road Accident : మరోవైపు మధ్యప్రదేశ్‌లోనూ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ట్రక్కు అదుపు తప్పి ముందున్న వాహనాల పైకి దూసుకెళ్లింది. ఫలితంగా ఒకదానితో ఒకటి ఢీకొని వాహనాల్లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ట్రక్కుతోపాటు మరో ఐదు వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ముగ్గురు సజీవ దహనమయ్యారు.