కారు డోర్లు లాక్.. ఊపిరాడక ముగ్గురు చిన్నారులు మృతి - Children dead in locked car
కారు డోర్లు లాక్ అయి ఊపిరాడక ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన తమిళనాడులోని తిరునెల్వేలిలో జరిగింది. కారులో ఆడుకుంటుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
తమిళనాడులోని తిరునెల్వేలిలో విషాద ఘటన జరిగింది. కారులో ఆడుకుంటుండగా డోర్లు లాక్ అయి ఊపిరాడక ముగ్గురు చిన్నారు ప్రాణాలు కోల్పోయారు. పనంగుడి సమీపంలోని లెప్పాయ్ అపార్ట్మెంట్లో నివాసం ఉండే నాగరాజన్ కుమారుడు నితీశ్(5), నితీశ(7), అదే అపార్ట్మెంట్లో ఉండే మరోవ్యక్తి సుధాకర్ కుమారుడు కబిసాంత్(4)గా గుర్తించారు.
ప్రమాదానికి గురైన కారు నాగరాజన్ సోదరుడు మనికందన్కు చెందినదిగా గుర్తించారు. కారులో ఆడుకుంటుండగా ఆకస్మికంగా డోర్లు లాక్ అయ్యాయి. చిన్నారులు డోర్లు తెరిచేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఊపిరాడక ముగ్గురు కారులోనే ప్రాణాలు విడచారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.