కేంద్రం అనుసరిస్తోన్న కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా పది కేంద్ర కార్మిక సంఘాలు నేడు దేశవ్యాప్త సమ్మె నిర్వహించనున్నాయి. ఈ బంద్‌లో భాగంగా 26, 27 తేదీల్లో 'ఛలో పార్లమెంట్' మార్చ్‌ను నిర్వహించున్నారు కార్మికులు. నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ బంద్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చాయి కార్మిక సంఘాలు. ఇందులో.. ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ, సీఐటీయూ, టీయూసీసీ, హెచ్ఎంఎస్, ఏఐయూటీయూసీ, ఎస్ఈడబ్ల్యూఏ, ఏఐసీసీటీయూ, ఎల్పీఎఫ్, యూటీయూసీలు పాల్గొంటున్నాయి. అయితే భాజపా కూటమికి చెందిన భారతీయ మజ్దూర్ సంఘ్(బీఎంఎస్) ఈ సమ్మెలో పాల్గొనేందుకు విముఖత చూపింది.
ప్రధాన డిమాండ్లు?
- పన్ను పరిధిలో లేని ప్రతి కుటుంబానికి నెలకు రూ.7,500 నగదు అందించాలి.
- పేద కుటుంబంలోని ప్రతి వ్యక్తికీ నెలకు 10 కిలోల రేషన్ బియ్యం ఉచితంగా ఇవ్వాలి.
- ఉపాధి హామీ పథకాన్ని సంవత్సరంలో 200 రోజులకు పొడిగించాలి.
- కేంద్రం అనుసరిస్తోన్న కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను వెనక్కి తీసుకోవాలి.
- నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత విధానాన్ని అమలు చేసి.. అందరికీ పెన్షన్ వచ్చేలా చేయాలి.
బ్యాంకు సేవలపై ప్రభావం..