తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అయోధ్యలో క్రూయిజ్ షిప్​ సేవలు​.. సరయూ నదిపై విహారం.. దీపావళి రోజే ప్రారంభం! - అయోధ్య బోట్​ సైటిందగ్​

Ayodhya Water Cruise Ship : దీపావళి రోజు అయోధ్యలో సరయూ నదిపై డబుల్​ డెక్కర్​ వాటర్​ క్రూయిజ్​ షిప్​ సేవలు ప్రారంభం కానున్నాయి. సరయూ నదీ విహరాన్ని పర్యటకులు ఆస్వాదించేందుకు ఆ క్రూయిజ్​ షిప్​లో ఎన్నో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది ఉత్తర్​ప్రదేశ్​ పర్యటక శాఖ. మరి ఆ విలాస నౌక ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం.

Ayodhya Water Cruise Ship :
Ayodhya Water Cruise Ship :

By

Published : Jul 19, 2023, 11:13 AM IST

Updated : Jul 19, 2023, 11:29 AM IST

Ayodhya Water Cruise Ship : ఉత్తర్​ప్రదేశ్​.. అయోధ్యలో రామమందిర నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే గ్రౌండ్​ ఫ్లోర్​ నిర్మాణం పూర్తవ్వగా.. మొదటి అంతస్తు పనులు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరిలో రాముడి విగ్రహం ప్రతిష్ఠాపన జరగనుండగా.. అప్పుడే భక్తులకు దర్శనభాగ్యం కలుగుతుందని ఇదివరకే ఆలయ నిర్వాహకులు తెలిపారు. అయితే అంతకన్నా ముందే.. దీపావళి పర్వదినాన సరయూ నదిపై వాటర్​ క్రూయిజ్ షిప్​ ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

దీపావళి నాడే ప్రారంభం..
అయోధ్యలో రామమందిర నిర్మాణంతో పాటు అక్కడ పర్యటకాన్ని ప్రోత్సహించేందుకు ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం అనేక విధాలుగా చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే సరయూ నదిపై వాటర్​ క్రూయిజ్​, బోట్​ హౌస్​ ఏర్పాటు చేసేందుకు అడుగులు వేస్తోంది. ఏటా దీపావళి సందర్భంగా ఘనంగా జరిగే దీపోత్సవ్ సమయంలో.. తొలి వాటర్​ క్రూయిజ్​ షిప్​ను నడిపేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.

క్రూయిజ్​ షిప్​ 'కనక్​'!
అయోధ్య వాటర్​ క్రూయిజ్​ షిప్​నకు కనక్​ అని పేరు పెట్టినట్లు ఆ రాష్ట్ర టూరిజం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముకేశ్ మెష్రామ్ తెలిపారు. దీపావళి నాడు భక్తులు.. క్రూయిజ్​ సౌకర్యాన్ని ఆస్వాదించాలన్నదే తమ ప్రయత్నమని చెప్పారు. అయోధ్యకు విచ్చేసే పర్యటకుల కోసం మరిన్ని సౌకర్యాలు కల్పించనున్నామని పేర్కొన్నారు. సరయూ నదిపై కనక్​ క్రూయిజ్​తో పాటు మరిన్ని షిప్​లు నడిపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. వాటర్ క్రూయిజ్ నిర్వహిస్తున్న ఓ సంస్థతో జరిపిన చర్చలు తుదిదశలో ఉన్నట్లు పేర్కొన్నారు.

కొత్త టెక్నాలజీ.. డబుల్ డెక్కర్​
అయోధ్యలో ప్రారంభించనున్న వాటర్ క్రూయిజ్ షిప్​.. వారణాసి క్రూయిజ్​కు భిన్నంగా ఉంటుందని వివరించారు. కొత్త టెక్నాలజీతో అయోధ్యలో డబుల్ డెక్కర్ వాటర్ క్రూయిజ్ నడుపుతామని​ తెలిపారు. అందుకు గుప్తర్ ఘాట్ వద్ద షెడ్‌ నిర్మిస్తున్నామని చెప్పారు. ఈ వాటర్ క్రూయిజ్ షిప్​ 25 మీటర్ల పొడవు, 8.3 మీటర్ల వెడల్పుతో ఉంటుందని అన్నారు. అది సౌరశక్తితో నడుస్తుందని.. పర్యావరణానికి ఎలాంటి హాని ఉండదని వెల్లడించారు.

నదీ విహారాన్ని ఆస్వాదించేందుకు..
వాటర్ క్రూయిజ్ మొదటి అంతస్తులో 100 మంది పర్యటకులు.. కూర్చునేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు. షిప్​ పైఅంతస్తు పూర్తిగా ఖాళీగా ఉంటుందని.. భక్తులు అక్కడ నిలబడి సరయూ నదీ విహారాన్ని ఆస్వాదించగలరని చెప్పారు. ఈ వాటర్‌ క్రూయిజ్‌లో సెల్ఫీ పాయింట్​తో పాటు డిజిటల్ స్క్రీన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Last Updated : Jul 19, 2023, 11:29 AM IST

ABOUT THE AUTHOR

...view details