కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యంలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదని ఆ పార్టీ ఉపాధ్యక్షుడు ఆర్ మహేంద్రన్ ఆరోపించారు. అందుకే తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు.
"మక్కల్ నీది మయ్యం లో ప్రజాస్వామ్యం లేదు. అయితే ఎన్నికల తర్వాత ఈ పరిస్థితి మార్చాలని అనుకున్నాను. తీరా చూస్తే అది జరిగేలా లేదు. పార్టీ నిర్వహణలో కమల్ హాసన్ విఫలమయ్యారు."
-ఆర్ మహేంద్రన్, మక్కల్ నీది మయ్యమ్ ఉపాధ్యక్షుడు