టూల్‌కిట్ కేసులో న్యాయవాది నికితా జాకబ్‌కు బాంబే హైకోర్టు ట్రాన్సిట్ ఆంటిసిపేటరీ (ముందస్తు) బెయిల్‌ను మంజూరు చేసింది. ముంబయి వాసి అయిన నికితపై దిల్లీలో ఎఫ్ఐఆర్ నమోదైన నేపథ్యంలో ఆమె కోర్టును ఆశ్రయించేందుకు మూడు వారాల సమయం ఇచ్చింది. ఇది నికితకు తాత్కాలిక ఊరట మాత్రమేనని.. నిర్దిష్ట గడువులోగా దిల్లీ కోర్టును ఆశ్రయించాలని స్పష్టం చేసింది.
"ఏ సమయంలోనైనా తనను అరెస్ట్ చేస్తారని దరఖాస్తుదారు(నికిత) భయాందోళనకు గురవుతున్నారు. వేరే రాష్ట్రంలోని కోర్టు నుంచి ఊరట పొందేందుకు ఆమె ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంది. అందువల్ల ఆమె అభ్యర్థన మేరకు రక్షణ కల్పించేందుకు ముందస్తు బెయిల్ మంజూరు చేయవచ్చని న్యాయస్థానం అభిప్రాయపడింది."
- జస్టిస్ పీడీ నాయక్, బాంబే హైకోర్టు
ఇవీ చదవండి: