పన్నెండు రాశుల (Horoscope today) వారి సమయం ఎలా ఉండనుందో డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ వివరించారు. ఆ సంగతులు మీకోసం..
మేషం..
శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. అష్టమ చంద్ర సంచారం అనుకూలంగా లేదు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. శ్రీవిష్ణు ఆరాధన మంచిది.
వృషభం..
మిశ్రమ వాతావరణం ఉంటుంది. అనవసర ఖర్చులు జరిగే సూచనలు ఉన్నాయి. అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడతారు.శివపార్వతులను పూజించడం వల్ల శుభ ఫలితాలను పొందగలుగుతారు.
మిథునం..
శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. గొప్ప ఆలోచనా విధానంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. ఒక శుభవార్త మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. శివ అష్టోత్తరం పఠించాలి.
కర్కాటకం..
ఉత్సాహంగా పనిచేయాలి. శ్రమ పెరగకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. కీలక వ్యవహారాల్లో కుటుంబ సహకారం అందుతుంది. అవగాహనా లోపం లేకుండా చూసుకోవాలి. ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. ఈశ్వర సందర్శనం శుభప్రదం.
సింహం..
చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయగలుగుతారు. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వస్తువులను కొంటారు. సూర్యాష్టకం పఠించడం మంచిది.
కన్య..
చేపట్టిన కార్యక్రమాలను మనోబలంతో పూర్తిచేస్తారు. ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో ప్రోత్సాహకరమైన పరిస్థితులు ఏర్పడతాయి. గోసేవ చేయడం మంచిది.