తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఈరోజు(22-06-2022) మీ రాశి ఫలం ఎలా ఉందో చూసుకున్నారా? - గ్రహబలం

Horoscope Today (22/06/2022): ఈ రోజు రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

Today Horoscope
రాశి ఫలం

By

Published : Jun 22, 2022, 4:59 AM IST

  • శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం; ఉత్తరాయణం; గ్రీష్మ రుతువు; జ్యేష్ఠ మాసం; బహుళపక్షం నవమి: రా. 12-53 తదుపరి దశమి, ఉత్తరాభాద్ర: ఉ.9-57 తదుపరి రేవతి, వర్జ్యం: రా.10-05 నుంచి 11-42 వరకు, అమృత ఘడియలు: ఉ. 6-47 వరకు, దుర్ముహూర్తం: మ.11-35 నుంచి 12-27వరకు, రాహుకాలం: మ. 12-00 నుంచి 1-30 వరకు, సూర్యోదయం: ఉ.5.30, సూర్యాస్తమయం: సా.6.33
  1. మేషం..చేపట్టే పనుల్లో ఓర్పు,సహనం,పట్టుదల అవసరం. అనవసరమైన ఆలోచనలతో కాలాన్ని వృథా చేయకండి. ద్వాదశ చంద్ర సంచారం అనుకూలంగా లేదు. విష్ణు సహస్రనామ పారాయణ శుభకరం.
  2. వృషభం.. వృత్తి,ఉద్యోగాల్లో తోటివారి ప్రోత్సాహంతో అనుకున్నది సాధిస్తారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా పట్టుదలతో ముందుకు సాగుతారు. అధికారులను మెప్పించడానికి అధికంగా శ్రమించాల్సి వస్తుంది.
  3. మిథునం..ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ బుద్దిబలంతో కీలక వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు. లక్ష్మీదేవి సందర్శనం శుభప్రదం.
  4. కర్కాటకం..శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. బంధు,మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. చిన్న చిన్నవిషయాలను సాగదీయకండి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఆదిత్య హృదయం చదవడం మంచిది.
  5. సింహం..చిత్తశుద్దితో పనులను ప్రారంభిస్తారు. ధర్మ కార్యక్రమాలను చేపడతారు. మీ పరిధిని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగాలి. తరచూ నిర్ణయాలు మార్చడం ద్వారా ఇబ్బందులు ఎదురవుతాయి. అవసరానికి సహాయం చేసేవారు ఉంటారు. ఆంజనేయ ఆరాధన శుభప్రదం.
  6. కన్య.. కీలక వ్యవహారంలో తోటివారి ఆలోచనల వల్ల మంచి జరుగుతుంది. ధర్మసిద్ది కలదు. కొందరి ప్రవర్తన మీ మనసును చికాకుపరుస్తుంది. అకారణ కలహసూచన ఉంది, కాబట్టి వాదనలకు దూరంగా ఉండటమే మంచిది. లక్ష్మీదేవి సందర్శనం మంచిది.
  7. తుల..అనుకూలమైన సమయం. బంధు,మిత్రులతో కలిసి కీలక విషయాలు చర్చిస్తారు. చేపట్టిన పనులను ప్రణాళికబద్దంగా పూర్తి చేసి అందరి ప్రశంసలను అందుకుంటారు. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సుందరకాండ పారాయణ శుభప్రదం.
  8. వృశ్చికం.. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. చేపట్టే పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ముఖ్య విషయాల్లో తోటివారి సూచనలు తీసుకోవడం మంచిది. కుటుంబ సహకారం ఉంటుంది. ఈశ్వరారాధన శుభప్రదం.
  9. ధనుస్సు.. దైవబలం అనుకూలిస్తోంది. ప్రారంభించిన పనులను తోటివారి సహకారంతో పూర్తిచేస్తారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. బంధు,మిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి. కీలకమైన చర్చలు ఫలిస్తాయి. రుణసమస్యలు లేకుండా చూసుకోవాలి. ఇష్టదైవ ప్రార్థన శుభాలను చేకూరుస్తుంది.
  10. మకరం..అనుకూలమైన సమయం. ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తిచేయగలుగుతారు. విందు,వినోద,ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. దైవారాధన మానవద్దు.
  11. కుంభం..ప్రారంభించిన పనిలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా తోటివారి సహకారంతో అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అధికారులతో కాస్త అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. ఇష్టదేవతా స్తోత్రం చదివితే బాగుంటుంది.
  12. మీనం..మనోధైర్యంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. ఒక వ్యవహారంలో కుటుంబసభ్యుల సహకారం లభిస్తుంది. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. విష్ణు అష్టోత్తర శతనామావళి చదివితే సమస్యలు తొలగుతాయి.

ABOUT THE AUTHOR

...view details